పీసీసీ ఉపాధ్యక్షుడిగా శ్రీపతి ప్రకాశం  | Sakshi
Sakshi News home page

పీసీసీ ఉపాధ్యక్షుడిగా శ్రీపతి ప్రకాశం 

Published Sat, Feb 22 2020 8:07 AM

Sripathi Prakasam Appointed As AP PCC Vice President - Sakshi

సాక్షి,  ఒంగోలు: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ )ఉపాధ్యక్షుడిగా సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, న్యాయవాది శ్రీపతి ప్రకాశంను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా పీసీసీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని శ్రీపతి ప్రకాశంకు పంపించారు. శ్రీపతి ప్రకాశం టంగుటూరు మండలం కాకుటూరువారి పాలెం ఆయన జన్మస్థలం. విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్‌ భారతి కాలేజీ, ఒంగోలులో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఒంగోలులోని ఇందిరా ప్రయదర్శిని లా కాలేజీలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు.

అనంతరం న్యాయవాద వృత్తి కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు లోనై 1978లో యూత్‌ కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పారీ్టలో పలు పదవులు అలంకరించారు. స్టేట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌గా, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆలిండియా టెలియం అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా, ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా, ఆలిండియా కోర్‌ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా సోలార్‌ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా టెక్స్‌టైల్స్‌ బోర్డు మెంబర్‌గా వివిధ పదవులు అలంకరించారు. 2015లో కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడిగా పదవిని చేపట్టి నేటికీ కొనసాగుతున్నారు.

2019లో కొండపి అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. శ్రీపతి ప్రకాశంకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ 42ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినందుకు గుర్తుగా తనకు ఈ అవకాశాన్ని అందించారని శ్రీపతి ప్రకాశం ఉధ్ఘాటించారు. పారీ్టనే నమ్ముకుని నాలుగు దశాబ్దాలుగా సేవలు చేశానని ఆయన పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి పారీ్టకి చేసిన సేవలకు గుర్తుగా పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, తమ నేత రాహుల్‌ గాందీకి, పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానా«థ్‌కు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

జిల్లా అధ్యక్షుడిగా ఈదా కొనసాగింపు 
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు(పీసీసీ) రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా ఈదా సుధాకరరెడ్డిని తిరిగి  రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఆవకాశం కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 2017 ఫిబ్రవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈదా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ) సాకె శైలజనాథ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.

Advertisement
Advertisement