శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేత | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేత

Published Thu, Aug 8 2013 8:45 PM

శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేత

ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను పూర్తిగా మూసివేశారు. జూరాల, తుంగభద్రల నుంచి 1,24,260 క్యూసెక్కులు మాత్రమే శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 883.90 అడుగులుగా ఉంది.

రెండు వపర్‌హౌస్‌ల్లో పూర్తిస్తాయి 13 జనరేటర్లతో విద్యుత్ ఉత్పాదన చేస్తూ 77,125 క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 16 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా, సుజల స్రవంతికి 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు రెండు పవర్‌హౌస్‌లలో 34.549 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

Advertisement
Advertisement