'బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది' | Sakshi
Sakshi News home page

'బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది'

Published Tue, Dec 17 2013 10:48 PM

'బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది' - Sakshi

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లును పూర్తిగా అధ్యయనం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలకు సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి విజ్క్షప్తి చేసినట్టు తెలిసింది. తెలంగాణ బిల్లుపై సభలో బుధవారం నుంచి జరుగనున్న చర్చ నేపథ్యంలో సీఎం కిరణ్తో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం రావొచ్చు అని ఈ భేటిలో సీఎం నేతలకు సూచించారు.  క్లాజుల వారీగా మనకున్న అభ్యంతరాలను సభలో నమోదు చేయాలని సీఎం సలహా ఇచ్చినట్టు సమాచారం. 
 
బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది అని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలతో సీఎం కిరణ్‌ అన్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి అని సీఎం నేతలకు తెలిపారు. రాత పూర్వకంగా కూడా స్పీకర్‌కు లేఖలు ఇద్దాం అని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలతో సీఎం కిరణ్‌ అన్నట్టు నేతలు వెల్లడించారు.   అసెంబ్లీలో టి.బిల్లుపై చర్చకు పూర్తిగా సహకరించాలని,  సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల భేటీలో నిర్ణయం తీసుకున్నారు.  అన్ని అంశాలను పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్పాలని ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు కొందరు కాంగ్రెస్ నేతలు మీడియాతో అన్నారు. 

Advertisement
Advertisement