ప్రగతి బాట.. | Sakshi
Sakshi News home page

ప్రగతి బాట..

Published Wed, Jan 1 2014 3:05 AM

stoping the attacks on girl and women

బాలికలు, మహిళలపై జరిగే దాడుల్ని అరికడతాం. ఇప్పటికే  చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. దోషులకు కఠిన చర్యలు పడేలా చూస్తాం. భవిష్యత్తులో ఆడపడుచులపై దాడులు జరగకుండా  చర్యలు తీసుకుంటాం. జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసి లక్ష్యాన్ని సాధించి తీరుతాం. యువత మేల్కోవాలి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఏడాది తొలి రోజునుంచే ప్రయత్నించాలి. ఓర్పు, పట్టుదల సడలకూడదు. తాత్కాలిక ఆనందాలకు లొంగకుండా... జీవితంలో నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చేదంతా ఎన్నికల సీజన్. అర్హులైన ప్రతి వ్యక్తీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకూ గురికావద్దు. నవభారత నిర్మాత.. యువతే అన్న విషయాన్ని విస్మరించకూడదు. అవినీతికి దూరంగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోండి. ప్రజలందరూ ఏడాదంతా సుఖ సంతోషాలతో గడపాలి. పంటలు సమృద్ధిగా పండాలి. రైతులు ఆనందంగా ఉండాలి.
 

Advertisement
Advertisement