బలి జరిగితేనే కానీ.... | Sakshi
Sakshi News home page

బలి జరిగితేనే కానీ....

Published Sat, Jul 26 2014 12:17 PM

బలి జరిగితేనే కానీ.... - Sakshi

ప్రస్తుత పరిస్థితులలో మనిషి ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయి. ఆ ప్రాణాలు ఎక్కడ ఎప్పుడు ఏలా పోతాయో ఎవరికి ఏరుకా. ఏదైన ప్రమాదం జరిగి మనుషులు మరణిస్తే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీ చేతులు కాలాక అకులు పట్టుకున్న చందంగా తయారైంది. అందుకు తాజా ఉదాహరణ....

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మరో 15 మంది వరకు గాయపడ్డారు. దేశంలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న సంఘటన ఇదే మొదటిది కాదు... గతంలో పలు రాష్ట్రాలలో ఇటువంటి తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం కాపలా లేని రైల్వే క్రాసింగ్లు, స్కూల్ బస్సు ప్రమాదాల నివారణ.... నిర్భయ అత్యాచారం వరకు ప్రభుత్వం ఏన్నో కమిటీలు వేసింది. ప్రభుత్వం కూడా ఆ కమిటీలు అందించిన నివేదికలు భద్రంగా అటకెక్కించింది. అదేమిటో ప్రమాదం జరిగినప్పుడే ప్రభుత్వ అధికారుల్లో స్పందన వస్తుంది. తనిఖీల పేరిట నానాహడావుడి చేస్తారు. అందుకు పాలెం బస్సు దుర్ఘటన అందుకు ఉదాహరణ.

ఆ తర్వాత నాలుగైదు రోజులకు వారు మొద్దు నిద్రలోకి జారుకుంటారు. ప్రమాదం జరిగి ప్రజలు బలి అయితేనే అటు రాష్ట్ర ప్రభుత్వంలోకానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ చిరు కదలిక వస్తుంది. అంతలోనే మళ్లీ ఇలాంటి వన్ని మాములే అని ప్రభుత్వ పెద్దలు సర్థి చెప్పుకుని కామ్గా ఉంటారు. ప్రజలకు ఎక్కడ,ఎలా ప్రమాదం జరిగే వీలు ఉంది... అటువంటి సంఘటనలు జరగకుండా ఏలాంటి చర్యలు తీసుకోవాలి... ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందితో సహా అందరిని భాగస్వామ్యం చేసుకుంటు ముందుకు వెళ్లితే ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం ఇలాంటి చర్యలు పునరావృతం కావు.

ఏదైన ప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలు బలి అయితేనే కానీ ప్రభుత్వం స్పందించదు. ఓ వేళ ప్రభుత్వం స్పందించిన... ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు తీసుకుంటాం... కమిటీ వేస్తున్నం ... నష్టపరిహారం కింద లక్షలు ఇస్తామని ప్రకటిస్తుంది. అంతే ఆ తర్వాత ప్రమాదంపై ప్రభుత్వం ఓ కమిటీ వేస్తుంది. ఆ కమిటీ నివేదక ఇస్తుంది. దాన్ని తీసుకువెళ్లీ అటకెక్కిస్తారు. అంతే ఆ తర్వాత మళ్లీ ఏదో ప్రమాదం సంభవించి... ప్రజలు పెద్ద సంఖ్యలో మృతి చెందితే... ప్రభుత్వం మళ్లీ ఇదే చిలకపలుకు పలుకుతుంది. అంతే కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా శాశ్వత నివారణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద ఉన్న జవాబు మాత్రం శూన్యం.

Advertisement
Advertisement