ఏజెంట్ శిఖరం | Sakshi
Sakshi News home page

ఏజెంట్ శిఖరం

Published Sun, Dec 29 2013 2:51 AM

ఏజెంట్ శిఖరం

 ఎల్‌ఐసీలో రాణిస్తున్న మహిళ
 =నాలుగేళ్లుగా ఎండీఆర్‌టీకి అర్హత
 =తాజాగా కోర్టు ఆఫ్ ది టేబుల్‌కు...
 =కమీషన్ రూపేణా ఏడాదికి రూ.25 లక్షలు

 
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : గుండెపోటుతో తండ్రి వీరస్వామి అకాల మరణం చెందడం కుటుంబాన్ని కుం గదీసినా... ధైర్యాన్ని కూడగట్టుకుని ఇద్ద రు చెల్లెలు, సోదరుడు, తల్లి భారతీదేవికి పెద్ద దిక్కుగా నిలిచింది సీర్లవంచ శారదాదే వి. తండ్రి మృతి సమయంలో ఉపాధి కార్యాలయం నుంచి వచ్చిన కాల్‌లెటర్‌తో ఎల్‌ఐసీ లో ఏజెంట్‌గా చేరి కుటుంబ పోషణ బాధ్యత లు మీద వేసుకుంది. ఇంటర్ చదువు తూ... అకుంఠిత దీక్షతో పాలసీలు చేయిస్తూ జీవిత బీమా సంస్థలో అనతికాలంలోనే ప్రత్యేకతను చాటుకుంది. బాధలు దిగమిం గుతూ ఏజెంట్‌గా కెరీర్ మొదలు పెట్టిన తొ మ్మిది నెలల కాలంలోనే ద్విచక్రవాహనం పొందేం దుకు అర్హత సాధించిందంటే... ఆ మెలోని పట్టుదలను ఇట్టే గ్రహించవచ్చు. అంతేకాదు జీవిత బీమా సంస్థలో అత్యుత్తమ రికార్డులు సాధిస్తూ... తన రికార్డులను తానే బద్దలు కొ డుతూ మిగతా ఎల్‌ఐసీ ఏజెంట్లకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తోంది శారదాదేవి.
 
కోర్ట్ ఆఫ్ ది టేబుల్‌కు 8వ ఏజెంట్...
 
వరంగల్ ఎల్‌ఐసీ డివిజన్‌లో ఎండీఆర్‌టీ సాధించిన మహిళా ఏజెంట్ శారదాదేవి కావడం విశేషం. ఏజెంట్‌గా రాణించడంతో ఆమెను చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వయిజర్‌గా నియమించారు. దీంతో ఆమె వ్యక్తిగతంగా బీమా చేయిస్తుండడంతోపాటు మరో 18 మంది ఏజెంట్లను నియమించుకుని విస్తృతంగా పాలసీలు చేయించారు. ఇలా ఒకే సంవత్సరంలో రూ.25 లక్షలకు పైగా కమీషన్ పొంది కోర్ట్ ఆఫ్ ది టేబుల్‌కు వరంగల్ డివిజన్ నుంచి ఎంపికైన తొలి ఏజెంట్‌గా రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు క ర్ణాటక రాష్ట్రాలు కలిగిన సౌత్ సెంట్రల్ జోన్‌లో ఎల్‌ఐసీకి 17 డివిజన్లు, 324 బ్రాంచీలున్నాయి. వీటిలో నుంచి కోర్ట్ ఆఫ్ ది టేబుల్‌కు 8వ ఏజెంట్‌గా శారదా దేవి ఎంపికై వరంగల్ ఎల్‌ఐసీ డివిజన్‌కు గర్వకారణంగా నిలిచింది.
 
ఉన్నత చదువులు అభ్యసించినా...
 
2004లో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభించిన శారదాదేవి... 2006లో మొగుళ్లపల్లి మండలం మొట్లగూడానికి చెందిన రమేష్‌ను వివాహమాడింది. వారికి ఇద్దరు కుమార్తెలు శ్రీవైష్ణవి, శ్రీహర్ష ఉన్నారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం చేసే అర్హత ఉన్నప్పటికీ.. శారదాదేవి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కొనసాగుతూ వస్తోంది.
 
 ఎల్‌ఐసీ జీవితాన్ని ఇచ్చింది...

 ఎల్‌ఐసీ నాకు జీవితాన్నిచ్చింది. కష్టాల్లో అండగా నిలిచింది. కుటుంబానికి ఆసరాగా నిలిచింది. చెల్లె, తమ్ముడు విద్యావంతులై జీవితంలో స్థిరపడడం నాకెంతో తృప్తినిచ్చింది. భర్త వ్యాపారంలో నష్టపోయినపుడు తమకు ధైర్యాన్నించ్చింది ఈ ఎల్‌ఐసీ ఏజెన్సీనే. దీంతో నా భర్తకు కూడా ఏజెంట్‌గా చేర్పించాను. నా ఇద్దరు కూతుళ్లు డాక్టర్, కలెక్టర్ అయినా.. వారిద్దరిని ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేర్పిస్తా. ఉన్నత చదువు చదివి ఏజెంట్‌గా చేయడమేమిటని బాధపడ్డా. ఏం చేస్తున్నామనేది కాదు... చేసిన దానిలో విజయం సాధించడం ముఖ్యం.

ఆ విజయం నీవే సాధించావని స్నేహితులు అనడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా భర్త రమేష్ సహకారంతో నేను ఈ విజయాలను సాధిస్తూ వస్తున్నా. మొగుళ్లపల్లి మండలం మొట్లగూడెం గ్రామంలో వరుసగా రెండేళ్లు వంద శాతం పాలసీలు చేయించి, భీమాగ్రామ్‌గా ఎంపిక చేయించాను. దీంతో రెండు సంవత్సరాలు ఎల్‌ఐసీ ఆ గ్రామానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ మొత్తానికి తాము కొంత కలిపి గ్రామంలో రెండు బోర్లు వేయించి, నీటి కొరతను తీర్చాం.
 - సీర్లవంచ శారదాదేవి, ఎల్‌ఐసీ ఏజెంట్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement