హైదరాబాద్ కు సూపర్ ఫాస్ట్ ప్రతిపాదన | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కు సూపర్ ఫాస్ట్ ప్రతిపాదన

Published Tue, Jan 6 2015 5:41 AM

హైదరాబాద్ కు సూపర్ ఫాస్ట్ ప్రతిపాదన - Sakshi

- పలురైళ్ల హాల్టింగ్‌కు విన్నపం
- రైల్వే బడ్జెట్ కోసం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదనలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు పగటిపూట సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 2015-16 బడ్జెట్ కోసం  ప్రతిపాదన పెట్టారు.  రైల్వే బడ్జెట్  ప్రతిపాదనలపై మంగళవారం విజయవాడలో జరగననున్న జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ఏర్పాటు చేస్తున్న సమావేశంలో కూడా ఆయన పాల్గొని తన వాదన వినిపించనున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటుపై ఆయన ఇప్పటికే  రైల్వే మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు.

ముంబై నుంచి గుంటూరుకు వయా గుంతకల్ మీదుగా కొత్త రైలు ఏర్పాటు చేయాలని కోరారు.  దీనివల్ల కర్నూలు, మహబూబ్‌నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని వేలాదిమంది ముంబైలో నివసించే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు గిద్దలూరు మీదుగా మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఒంగోలు నుంచి దొనకొండ రైల్వే లైను, ఒంగోలులో ఏర్పాటు చేసే ఎస్కలేటర్లు, లిఫ్ట్ల్, నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే లైను, గుంటూరు వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన రైలునీర్ ప్లాంట్ ప్రగతిపై నివేదిక కావాలని కోరారు.

పలు రైళ్లను పొడిగించాలని కోరారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకూ వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల వరకూ పొడిగించాలని, గుంటూరు - ద్రోణాచలం మధ్య నడిచే  రైలును గుంతకల్ వరకూ పొడిగించాలని కోరారు. నంద్యాల  - కర్నూలు మధ్య నడుస్తున్న డెమో రైలును గిద్దలూరు వరకూ, తెనాలి మార్కాపురం మద్య నడుస్తున్న రైలును గిద్దలూరు వరకూ, సాయినగర్ షిర్టీ నుంచి విజయవాడ వరకూ నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను గూడూరు జంక్షన్ వరకూ పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు.

ఒంగోలు స్టేషన్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ స్టేషన్ కావదడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ముఖ్యంగా కేరళా, బీహార్, హిమాచలప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నందున వారికి అనుగుణంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఒంగోలులో ఆగేలా చూడాలని కోరారు.
 
ఒంగోలులో ఆగాల్సిన రైళ్లు
చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్,  చెన్నై - జోధ్‌పూర్ - చెన్నై మధ్య నడిచే జోద్‌పూర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై - జైపూర్ - చెన్నై మధ్య నడిచే జైపూర్ ఎక్స్‌ప్రెస్,  పొండిచ్చేరీ - న్యూఢిల్లీ - పాండిచ్చేరీ మధ్య నడిచే పాండిచ్చేరీ ఎక్స్‌ప్రెస్‌లకు ఒంగోలులో హాల్ట్ ఇవ్వాలని కోరారు.
 
టంగుటూరులో ఆగాల్సిన రైళ్లు...
తిరుపతి - విశాఖపట్నం మధ్య నడిచే తిరుమలా ఎక్స్‌ప్రెస్,  చెన్నై - ఎగ్‌మోర్ మధ్య నడిచే సర్కార్ ఎక్స్‌ప్రెస్,  చెన్నై - హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్. గూడూరు - హైదరాబాద్ నడుమ నడిచే సింహపూరి ఎక్స్‌ప్రెస్.
 
సింగరాయకొండలో నిలపాల్సిన రైళ్లు...
హైదరాబాద్ - కొచ్చిన నడుమ నడిచే శబరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్, చైన్నై - హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం - తిరుపతి మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్.
 
దొనకొండలో ఆగాల్సిన రైళ్లు
హౌరా వెళ్లే ఎస్‌ఎస్‌పిఎన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు.
కురిచేడులో ఆగాల్సిన రైళ్లు..
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
గిద్దలూరులో ఆగాల్సిన రైళ్లు
పూరీ నుంచి బెంగళూరు వెళ్లే గరీబ్ధ్

Advertisement

తప్పక చదవండి

Advertisement