ఇదీ అసలు రంగు! | Sakshi
Sakshi News home page

ఇదీ అసలు రంగు!

Published Tue, Jun 2 2015 1:46 AM

ఇదీ అసలు రంగు! - Sakshi

 సాక్షి ప్రతినిధి, కడప :  చెప్పేందుకే శ్రీరంగనీతులు అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి స్పష్టమౌతోంది. అనైతిక చర్యలకు నిలువెత్తు నిదర్శనంగా రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైశ్రాయి హోటల్ కేంద్రంగా నిర్వహించిన క్యాంపు రాజకీయాల నుంచి నిన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ కుట్రలు, కుయుక్తులతోనే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా టీడీపీ వ్యవహరించింది. అందులో భాగంగానే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడటంపై ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోయారు. బాస్ (చంద్రబాబు) సూచన మేరకే తానొచ్చానని రేవంత్ పేర్కొనడాన్ని టీవీ చానళ్లలో కోట్లాది మంది వీక్షించి.. బాబు అసలు నైజం ఇపుడు బట్టబయలైందని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనలో అసలు సూత్రధారి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ప్రజా ప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 నిస్సిగ్గుగా జెడ్పీటీసీ సభులకు వల
 ఆవు చేలో మేస్తే దూడ గట్టున వేస్తుందా.. అన్నట్లుగా టీడీపీ అధినేతకు తగ్గట్టుగానే జిల్లాలో టీడీపీ నేతలు నడుచుకుంటున్నారు. యర్రగుంట్ల మున్సిపాలిటిలో 20 మంది కౌన్సిలర్లుకు కాను 18 మందిని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. వారిలో ఎనిమిది మంది కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి టీడీపీ క్యాంపు రాజకీయాలు నిర్వహించింది. ప్రజల తీర్పును గౌరవించాల్సిన ఆ పార్టీ దొడ్డిదారిన పాలకమండలిని కైవసం చేసుకోవాలనే ఎత్తుగడలతో వ్యవహరించి అభాసుపాలైంది.

వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన నలుగురు జెడ్పీటీసీ సభులను భుజానెత్తుకుంది. టీడీపీకి నైతిక విలువలు అనేవి ఏవైనా ఉంటే ఆ నలుగురిని వారి పదవులకు రాజీనామా చేయించి టీడీపీ తీర్థం ఇప్పించాల్సి ఉంది. వీరితోపాటు మరికొందరు జడ్పీటీసీ సభ్యులకు  సైతం వల విసిరింది. అధికారమనే పెట్టుబడితో వారిని వశపర్చుకునేందుకు సిద్ధమౌతోంది. ఇటీవల వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న తిరుపాలురెడ్డిని సైతం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పదవీచ్యుతున్ని చేశారు. టీడీపీ తెరవెనుక మంత్రాంగంతోటే చైర్మన్ గిరిని దక్కించుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా రాబోవు రోజుల్లో జెడ్పీ చైర్మన్, మేయర్ పదవులను సైతం కైవసం చేసుకుంటామని టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిస్సిగ్గుగా మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ కూడా ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని ఎత్తి చూపుతున్నాయి.  
 
 చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చాలి
  పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే జేఎంఎం ముడుపుల వ్యవహారంలో ఇరికించారు. అప్పుడు ఎలాంటి రికార్డింగులు కూడా లేవు. నేడు చంద్రబాబే ఆ డబ్బు ఇవ్వమన్నట్లు రేవంత్ చెప్పడంపై ఏసీబీ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ డబ్బులు చంద్రబాబుకు ఎక్కడి నుంచి వచ్చాయి.. అనే కోణంలో కూడా విచారణ జరగాలి. ఏపీలో పట్టిసీమ లాంటి   ప్రాజెక్టుల ద్వారా ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి వినియోగిస్తున్నట్లు అర్థమవుతోంది. 
- పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు
 
 ఇలాంటివి మంచిది కాదు
  ఈ తరహా రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎమ్మెల్యేలను కొని అధికారాన్ని చేజిక్కించుకోవడం చట్ట విరుద్దం. ఇది ఆ పార్టీకే కాదు ప్రజా స్వామ్యానికి కూడా హాని చేస్తుంది. ఇలా ఎవరు చేసినా తప్పే. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.
   - శశిభూషణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు.
 
 చెప్పేందుకేనా నీతులు...
     చంద్రబాబు నీతులు బాగా చెబుతాడు. ఈ వ్యవహారం చూస్తుంటే.. చెప్పేందుకే నీతులు అని స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా కుర్చీలను కాపాడుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇందువల్లే ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి నిరభ్యంతరంగా జంప్ అవుతున్నారు. ఎవడెంత గట్టిగా అరిస్తే వాడు అంత పెద్ద దొంగ అని దీన్ని బట్టి అర్థమవుతుంది.
   - గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి.
 
  బాబుది మొదటి నుంచి అదే చరిత్ర
  నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి నీచ సంృ్కతి గల నేత. ఆయనకు ఇవి కొత్తకాదు. పిల్లనిచ్చిన మామను గద్దె దింపడానికి ఆనాడు ఎమ్మెల్యేలను ధనంతో ప్రలోభపెట్టి లోబరుచుకొన్నారు. నేడు తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేయడానికి డబ్బును ఎరగా వేస్తున్నారు.
     - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు.
 
 సీఎం పదవికి రాజీనామా చేయాలి
  ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి. నైతిక విలువలు, నీతి, నిజాయితీల గురించి నిత్యం వల్లె వేస్తూ రహస్యంగా ఇలాంటివి చేయడం దారుణం. ఇంత జరిగినా చంద్రబాబు నోరు విప్పలేదంటే ఆయన పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.
    - ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి.
 
 టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి
  ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం దారుణం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యవహారాలు నడపటం అప్రజాస్వామికం. ఎమ్మెల్సీ పదవి కోసం డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అత్యంత నీచం. ముడుపులు ఇచ్చిన ఎమ్మెల్యేతో పాటు, ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.
   - ఎస్‌బి అంజద్‌బాషా, ఎమ్మెల్యే, కడప.
 
 రేవంత్‌రెడ్డి ఒక పావు మాత్రమే..
     దివాళాకోరు రాజకీయాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. చంద్రబాబు అసలు నైజం ఇప్పుడు బయట పడింది. తెలుగు గౌరవాన్ని నిలబెడతాం, నీతి, నిజాయితీలంటూ మహానాడులో కథలు చెప్పిన మరుసటి రోజే ఇలా అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ విలువల్లేని పార్టీ. చంద్రబాబు అవినీతి చక్రవర్తి. ఆయన అత్యంత అవినీతి పరుడని, దేశంలోని అత్యంత ధనవంతుల్లో చంద్రబాబు ఒకరని తెహల్కా డాట్ కామ్ ఆనాడే చెప్పింది. చంద్రబాబు ఆడిన నాటకంలో రేవంత్‌రెడ్డి ఒక పావు మాత్రమే.
    - పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం.
 
 అత్యంత దురదృ ష్టకరం
     నీతి నిజాయితీలకు కట్టుబడి పాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చాక ఇలాంటి వ్యవహారాలు చేయడం దురదృ ష్టకరం. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు కొరవడ్డాయి.
    - ఎస్‌వీ రమణారెడ్డి, వైఎస్‌ఆర్‌టీఎఫ్ అధ్యక్షుడు, వైఎస్‌ఆర్ జిల్లా

 తొలి నిందితుడు బాబే
  ఎమ్మెల్సీ ఓటును కొనేందుకు రు.50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ప్రథమ ముద్ధాయిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చేర్చాలి. తమ ఎమ్మెల్యేను తెలంగాణ సీఎం కేసీఆర్ కొంటున్నారని, అయినా తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని గొప్పలు చెప్పిన చంద్రబాబు నీచ సంృ్కతి బట్టబయలైంది. చట్టం అందరికీ సమానం అని చెప్పే చంద్రబాబును చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి.
 -సుధా ఉత్తమారెడ్డి, మండల కన్వీనర్, వైఎస్‌ఆర్ సీపి, కమలాపురం.
 
 రాజకీయాలు నీచంగా తయారయ్యాయి
 రాజకీయాలు విలువలు లేకుండా నీచంగా తయారయ్యాయి. ప్రతి విషయంలో డబ్బునే ప్రధానంగా చూస్తున్నారు. నేటి నాయకులు ప్రజా సేవ మరచి అధికారం కోసం కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలి.
 -రాజగోపాల్‌రెడ్డి, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, కమలాపురం.
 
 చంద్రబాబు సమర్థించడం శోచనీయం

 అవినీతి నాయకులను ఏపీ ముఖ్యమంత్రి సమర్ధించడం శోచనీయం. ఒక్క ఓటు కోసం రూ.5 కోట్లు వెచ్చిండం దారుణం. ఇదే డబ్బును అభివృద్ధికి వెచ్చిస్తే ఒక ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. బ్లాక్ మనీని ఇలా ఉపయోగిస్తూ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అందరూ భాగస్వామ్యులు కావాలని చెప్పడం సిగ్గుచేటు. అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నాయకుల భరతం పట్టి వారి బ్లాక్ మనీని సీబీఐ బయటకు తీయాలి.
 -రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు, వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్
 
 అధికారం కోసం బాబు ఏమైనా చేస్తారు

 అధికార దాహంతో చంద్రబాబు ఏపనైనా చేయగల సమర్ధుడని ఈ సంఘటనతో రుజువయ్యింది. పారదర్శకత, అవినీతి రహిత పాలన గురించి పదే పదే మాట్లాడే ఆయన ఇప్పుడేం చెబుతారో చూడాలి. మండలి సీటు కోసం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ద్వారా కోట్ల రూపాయలతో బేరసారాలు సాగించి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. తమ బాస్ వెళ్లమంటేనే వచ్చానని చెప్పే కాల్ రికార్డింగ్స్ స్పష్టంగా ఉన్నాయి.
                                    - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు.
 
 జనాన్ని ఇంకా నమ్మిస్తూనే ఉన్నారు..
     టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఓటు కోసం డబ్బు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దొరికిన తర్వాత అయినా హుందాగా వ్యవహరించకుండా మీసం మెలేస్తూ పౌరుషంగా మాట్లాడాడు. ఇంకా తాము నిజాయితీ పరులమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ ఎమ్మెల్యే ఓటును ఇలా కొనుగోలు చేయడం.. ఆ వ్యవహారం ఎలా సాగిందో రికార్డుల ద్వారా దొరకడం అసహ్యకరం. కేసీఆర్ పార్టీ పవిత్రమైనదని నేను చెప్పడం లేదు. భ్రష్టు పట్టిన ప్రస్తుత రాజకీయాలకు ఇదో ఉదాహరణ.
 - జయశ్రీ, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్.

 ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడటంపై ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోయారు. బాస్ (చంద్రబాబు) సూచన మేరకే తానొచ్చానని రేవంత్ పేర్కొనడాన్ని టీవీ చానళ్లలో కోట్లాది మంది వీక్షించి.. బాబు అసలు నైజం ఇపుడు బట్టబయలైందని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనలో అసలు సూత్రధారి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ప్రజా ప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 నిస్సిగ్గుగా జెడ్పీటీసీ సభులకు వల
 ఆవు చేలో మేస్తే దూడ గట్టున వేస్తుందా.. అన్నట్లుగా టీడీపీ అధినేతకు తగ్గట్టుగానే జిల్లాలో టీడీపీ నేతలు నడుచుకుంటున్నారు. యర్రగుంట్ల మున్సిపాలిటిలో 20 మంది కౌన్సిలర్లుకు కాను 18 మందిని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. వారిలో ఎనిమిది మంది కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి టీడీపీ క్యాంపు రాజకీయాలు నిర్వహించింది. ప్రజల తీర్పును గౌరవించాల్సిన ఆ పార్టీ దొడ్డిదారిన పాలకమండలిని కైవసం చేసుకోవాలనే ఎత్తుగడలతో వ్యవహరించి అభాసుపాలైంది.

వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన నలుగురు జెడ్పీటీసీ సభులను భుజానెత్తుకుంది. టీడీపీకి నైతిక విలువలు అనేవి ఏవైనా ఉంటే ఆ నలుగురిని వారి పదవులకు రాజీనామా చేయించి టీడీపీ తీర్థం ఇప్పించాల్సి ఉంది. వీరితోపాటు మరికొందరు జడ్పీటీసీ సభ్యులకు  సైతం వల విసిరింది. అధికారమనే పెట్టుబడితో వారిని వశపర్చుకునేందుకు సిద్ధమౌతోంది. ఇటీవల వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న తిరుపాలురెడ్డిని సైతం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పదవీచ్యుతున్ని చేశారు. టీడీపీ తెరవెనుక మంత్రాంగంతోటే చైర్మన్ గిరిని దక్కించుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా రాబోవు రోజుల్లో జెడ్పీ చైర్మన్, మేయర్ పదవులను సైతం కైవసం చేసుకుంటామని టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిస్సిగ్గుగా మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ కూడా ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని ఎత్తి చూపుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement