ఎస్వీయూలో నిరుత్సాహ మేళా | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో నిరుత్సాహ మేళా

Published Sat, May 7 2016 1:54 AM

ఎస్వీయూలో నిరుత్సాహ మేళా

ఇంటర్వ్యూలు తప్ప ఉద్యోగాలు ఇవ్వని కంపెనీలు
 
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో శుక్రవారం నిర్వహించిన చంద్రన్న ఉద్యోగ మేళా నిరుద్యోగులకు నిరాశ కల్పించింది. 20 కంపెనీలు వస్తున్నాయంటూ ఊదరకొట్టిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించడంలో విఫలమైంది. ఎస్వీయూలో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్ప నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. చాలా మందిని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాలకు రావాలని సూచిం చారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎస్వీయూలో శుక్రవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిం చింది. పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో నిరుద్యోగులు ఎక్కువ మంది వచ్చారు.

ఎస్వీయూ వీసీ దామోదరం ప్రారంభించారు. శ్రీనివాస ఆడిటోరియం, ప్రకాశ్‌భవన్, పాత ఎంబీఏ భవనంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొదట ముందుగా రిజిస్ట్రేషన్ చేసిన వారిని మాత్రమే అనుమతించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారిని అనుమతించకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వారు కూడా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.


ఇబ్బంది పడ్డ విద్యార్థులు..
జాబ్‌మేళాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదువేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కువమంది రావడంతో వారు ఆహారం, ఇతర అంశాల్లో ఇబ్బందిపడ్డారు. ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చింది. వర్షం పడడంతో తలదాచుకోవడానికి కష్టపడ్డారు. ఎక్కువ మందిని సెల్ఫ్ డీటైల్స్ అడిగి పంపారని విద్యార్థులు తెలిపారు. బీటెక్, డిగ్రీ వారికి ప్రాధాన్యత ఇచ్చారని, పీజీ విద్యార్థులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు విద్యార్థులు చెప్పారు. మార్కెటింగ్, బీపీవో ఉద్యోగాలు తప్ప మంచి ఉద్యోగాలు లేవని, రెండుమూడు కంపెనీలే గుర్తింపు పొందినవని నిరుద్యోగ అభ్యర్థులు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement