తెలంగాణ నోట్ ఆమోదంతో నోళ్లన్నీ తీపి | Sakshi
Sakshi News home page

తెలంగాణ నోట్ ఆమోదంతో నోళ్లన్నీ తీపి

Published Fri, Oct 4 2013 12:45 AM

sweets distributed after T-note Acceptence

 సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణవాదులు గురువారం రాత్రి సిద్దిపేటలో సంబరాలు జరుపుకున్నారు. పలువురు మిఠాయిలు పంచుతూ నోళ్లు తీపి చేశారు. అంబేద్కర్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. టీఆర్‌ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆపస్, బీజేపీ నాయకులు వేర్వేరు గా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరుల  త్యాగాల ఫలితమే ఈ విజయమని, వారికే అంకితమ ని వారు స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలతో సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందన్నారు. అణచివేత, దోపిడీ, పీడన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుభి క్షమైన తెలంగాణను నిర్మించుకుందామని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
 
  కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు మచ్చ వేణు, మోహన్‌లాల్, నయ్యర్ పటేల్, నందు, కాముని నగేశ్, బర్ల మల్లికార్జున్, కలకుంట్ల మల్లికార్జున్, తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సం ఘం సిద్దిపేట నాయకులు వెంకటగోపాల్, కృష్ణ, కనకయ్య, నయీమొద్దీన్, శ్రీకాంత్, కిష్టయ్య, శ్రీనివాస్, బాల కృష్ణ, ఆపస్ నేతలు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనర్స య్య, శ్రీనాకర్‌రెడ్డి, కిష్టారెడ్డి, దేవదాస్, మొలంకల శ్రీనివా స్, వెంకటనారాయణ, మన్మోహన్, రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, అశోక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.బుచ్చిరెడ్డి, నేతలు వంగ రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఉమేశ్‌గౌడ్, భానుచందర్, ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ, టీటీఎఫ్, టీడీటీఎఫ్ సంఘాల నేతలు పాల్గొన్నారు.
 
 టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో...
 పటాన్‌చెరు టౌన్: టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం రాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. టీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంపి ణీ చేశారు. తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియతో మరో అడుగు ముందుకు పడిందన్నారు. ఆత్మబలిదానం చేసుకున్న వారి త్యాగాలు వృధా పోలేదన్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ సహకారాన్ని మరువరని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణవాదులు విజయ్, బసవేశ్వర్, చంద్రశేఖర్, ఓం ప్రకాశ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement