వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది | Sakshi
Sakshi News home page

వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది

Published Tue, Dec 10 2013 3:52 AM

system is great compare to person

 సాలూరు రూరల్/బొబ్బిలి/బెలగాం, న్యూస్‌లైన్ : వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు అన్నారు. సోమవారం సాలూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరైన అధ్యయనం లేకుండా న్యాయవాదులు కోర్టుకు హాజరుకావద్దని సూచించారు. లేకపోతే కేసులు అనవసరంగా వారుుదాపడతాయని చెప్పారు. అనంతరం దుర్గా ప్రసాదరావు దంపతులను బార్ అసోసియేషన్ చైర్మన్ ఎన్‌ఎస్ చలం, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి గౌరీశంకరరావు, సీనియర్ న్యాయవాదులు గొర్లె రామకృష్ణ, కిలపర్తి రామమూర్తి, కర్రి సన్యాసిరావు, సీఐ దేముళ్లు, ఎస్‌ఐ టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
 బొబ్బిలిలో ఘన సత్కారం...
 పన్నెండేళ్ల కిందట న్యాయవాది వృత్తి చేసిన కోర్టుకే హైకోర్టు న్యాయమూర్తి హోదాలో వచ్చిన దుర్గాప్రసాదరావును బొబ్బిలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం పోలీసు వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా  బార్ అధ్యక్ష, కార్యదర్శులు తాన్న రామకృష్ణ, గంటి గోపాలకృష్ణ శర్మలు జ్ఞాపికను అందించారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు జవహార్, వరహ గిరి ప్రసాదరావు, ప్రకాశరావు, వడ్డే శ్రీరాంమూర్తి, ఎంఎం జగ్గారావు, మత్స బెనర్జీ, చోడిగంజి రామారావు, తాన్న రామకృష్ణలను న్యాయమూర్తి సన్మానం చేశారు. చివరిగా న్యాయవాది పాణిగ్రాహికి సన్మానం చేస్తూ ఇది తనకు తానే చేసుకుంటున్న సన్మానమని వ్యాఖ్యానించారు. జూనియర్ న్యాయవాదులకు  కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్-1908 పుస్తకాన్ని బహుకరించారు. న్యాయవాద వృత్తిలో  గురువైన ఓలేటి సీతారామమూర్తి చిత్రపటాన్ని దుర్గాప్రసాదరావు ఆవిష్కరించారు. సన్మానం అనంతరం జరిగిన సభలో గత స్మృతులను తలుచుకున్నారు.  కార్యక్రమంలో సబ్ జడ్జి తిరుమలరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి విజయకల్యాణి తదితరులు పాల్గొన్నారు.
  
 పార్వతీపరం కోర్టు సందర్శన
 పార్వతీపురం కోర్టును హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు సందర్శించారు.  నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనం నిర్మాణం నిధులు కొరత కారణంగా నిలిచిపోయిందని స్థానిక జడ్జి పి.వి.రాంబాబు నాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. నిధులు మంజూరు చేసేందుకు  చర్యలు తీసుకుంటానని ఆయన హామీఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక జడ్జీలు శ్రీనివాసశర్మ, కృష్ణసాయితేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement