చివరకు.. వాళ్లు కరివేపాకు | Sakshi
Sakshi News home page

'చివరకు.. వాళ్లు కరివేపాకు

Published Sun, Apr 27 2014 2:28 PM

చివరకు.. వాళ్లు కరివేపాకు - Sakshi

టీడీపీ రెబెల్స్‌గా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కొట్టు సత్యనారాయణ, టీవీ రామారావులను ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ, కొవ్వూరులో టీవీ రామారావు, పాలకొల్లులో త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి)లకు టీడీపీ అధినేత చంద్రబాబు మ్యాండెట్ ఆశ చూపించి.. చివరకు కరివేపాకులా తీసిపారేశారు. దీంతో వీరంతా రెబెల్ అభ్యర్థులుగా పోటీకి దిగారు. టీడీపీ అంతు చూస్తామని, ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశారు.
 
 ఈ నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ, టీవీ రామారావుపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. అరుుతే, పాలకొల్లు రెబెల్ అభ్యర్థి త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి)పై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ విషయూన్ని ముందే పసిగట్టిన ఆయన శుక్రవారం రాత్రే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బాబ్జితో టీడీపీ వర్గాలు తెరవెనుక మంత్రాగం నడుపున్నాయని.. ఆ కారణంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడలేదనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.  ఏ పార్టీలో ఉన్నారో తెలియని కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీ తరఫున నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న విషయం విదితమే. దీంతో ఆయనను టీడీపీకి చెందిన వ్యక్తిగా భావించి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా బీజేపీ నేతలు చంద్రబాబును కోరారు. కానీ రఘురామరాజుపైనా ఎలాంటి చర్యలు లేవు.
 
 నట్టేట మునిగారు
 తనవారైనా.. పరాయి వారైనా టీడీపీని నమ్మితే వెన్నుపోటు పొడిచే సంస్కృతిని చంద్రబాబుకు అలవాటైపోరుుంది. తన స్వార్థం కోసం చివరి నిమిషం వరకూ వాడుకుని ఎంగిలి విస్తరాకులా విసిరేయడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన  విద్య. ఇది తెలిసి కూడా ఆయనను గుడ్డిగా నమ్మి వెళ్లిన వారికి తేరుకోలేని ఎదురుదెబ్బలు తగలడం పరిపాటిగా మారింది. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. ఆఖరి క్షణం వరకూ మీదే మ్యాండెట్ అని నమ్మించి చివరికి తూచ్ అనడంతో అవమాన భారం భరించలేని టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గంపెడాశతో టీడీపీలోకి వెళ్లిన కొట్టు సత్యనారాయణకు, బాబునే నమ్ముకుని ఉన్న టీవీ రామారావుకు చంద్రబాబు వల్ల చివరకు మొండిచెయ్యే మిగిలింది.
 

Advertisement
Advertisement