శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య

Published Sat, May 30 2015 4:59 AM

Tamil Nadu Governor K Rosaiah at tirumala

సాక్షి, తిరుమల : తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శుక్రవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా మహాద్వారానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట డెప్యూటీ ఈవోలు సాగి వేణుగోపాల్, కోదండరావు ఉన్నారు.

 రుతువులు సక్రమంగా ఉండాలని శ్రీవారు దీవిస్తారు
 తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ప్రతి సారి కుటుంబ సభ్యులతో వచ్చే ఆనవాయితీ ఉందని, ఈ సారి మాత్రం ఒంటరిగానే వచ్చి  ఏడుకొండలవాడిని దర్శించుకున్నానన్నారు. రాష్ట్రంలో వాతావరణం బాగా వేడిగా ఉందని, రుతువులు సక్రమంగా ఉంటూ ప్రజలంందరూ సుఖంగా ఉండేలా భగవంతుడు దీవిస్తాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.

 అమ్మవారి సేవలో రోశయ్య
 తిరుచానూరు: తిరుచానూ రు శ్రీపద్మావతి అమ్మవారిని తమిళనాడు గవర్నర్  కే.రోశయ్య శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆల యం ఎదుట టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్ వరప్రసాద్, ఎన్టీఆర్ రవి, పసుపర్తి గోపి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్‌కు  ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement
Advertisement