4న తిరుపతిలో టీడీఎల్పీ సమావేశం | Sakshi
Sakshi News home page

4న తిరుపతిలో టీడీఎల్పీ సమావేశం

Published Sat, May 31 2014 12:38 AM

TDLP meeting in Tirupathi on june 4th

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) సమావేశం జూన్ నాలుగో తేదీన తిరుపతిలో జరగనుంది. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోని సెనేట్‌హాల్ లేదా ఆడిటోరియంలో సమావేశం  జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు.

Advertisement
Advertisement