‘హై సెక్యూరిటీ’ని ఆపండి | Sakshi
Sakshi News home page

‘హై సెక్యూరిటీ’ని ఆపండి

Published Tue, Dec 24 2013 12:59 AM

TDP demand for stop Vehicle High security number plates project

రవాణా కమిషనర్‌ను కోరిన టీడీపీ ఎమ్మెల్యేలు

 సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్ర విభజన జరగనున్న నేపథ్యంలో వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను వెంటనే నిలుపుద ల చేయాలని ప్రభుత్వాన్ని టీడీపీ కోరింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, జి. జైపాల్‌యాదవ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సోమవారం రవాణా కమిషనర్ అనంత రాములుకు ఓ వినతిపత్రం అందచేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రస్తుతం అసెంబ్లీలో ఉందని, త్వరలో విభజన జరగబోతోందని తమ వినతిపత్రంలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ తరుణంలో సాధారణ నంబర్ ప్లేట్ల స్థానంలో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలనే ఉత్తర్వులను నిలిపేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల తయారీకి అయ్యే ఖర్చు మన రాష్ర్టంతో పోలిస్తే 25 శాతం తక్కువగా ఉందని, ఈ నిబంధన అమలు చేసే ముందు ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు.
 జవాన్ల మృతిపట్ల చంద్రబాబు సంతాపం: దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతిదళంపై రెండు వేల మంది ఆందోళనకారులు దాడి చేసిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు మృతిచెందటం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement