హరిపురంలో సర్వే కలకలం

2 Feb, 2019 08:31 IST|Sakshi
కాశీబుగ్గ: పోలీసుల సమక్షంలో యువకులను ప్రశ్నిస్తున్న లొద్దబద్ర గ్రామస్తులు

అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

శ్రీకాకుళం, మందస: గ్రామాల్లో కొంతమంది యువకులు ఎన్నికల సర్వే పేరిట సర్వే చేస్తూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓటర్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాయి. సర్వే చేస్తున్నామని, తా ము అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వాలని తెలివి గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ తరుణంలో మందస మండలంలోని హరిపురంలో శుక్రవారం కొంతమంది యువకులు ఐడీ కార్డులు మెడలో వేసుకుని వీధుల్లో తిరిగారు. అయితే, వీరిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆన ల వెంకటరమణ, పసుపురెడ్డి రామారావు(రా ము), మావుడెల్లి జనార్దన తదితరులు గుర్తించి, సర్వే చేస్తున్న యువకులను నిలదీశారు. పబ్లిక్‌ పాలసీ రిసెర్చ్‌ గ్రూప్‌ పేరిట తాము సర్వే చేస్తున్నామని, అవసరమైతే తమను నియమించిన వారితో మాట్లాడుకోమని చెబుతూనే తమ సర్వే ను అడ్డుకుంటున్నారని ఫోన్‌లో అవతల ఎవరికో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, సర్వే పేరిట ఓటర్లను తొలగిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న వారి పేర్లు తీసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని అటువైపు నుంచి సర్వేయర్లకు చెప్పగా, దీంతో పార్టీ నాయకులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సర్వే చేస్తే సహించేదిలేదని తేల్చి చెప్పడంతో సర్వేకు వచ్చిన వారు అక్కడ నుంచి వెనుదిరిగారు.

రహస్య సర్వేకు అడ్డు
కాశీబుగ్గ: పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో రహస్యం గా సర్వే చేస్తున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నా రు. వీరు ట్యాబ్‌ను పట్టుకుని ఎమ్మెల్యే పనితీరు, అధికారపక్షం, ప్రతిపక్షం పనితీరు, ఏ టీవీ చూస్తున్నారు, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ప్రజల నుంచి వివరాలు సేకరిస్తూ వారి ఓటర్‌ ఐడీతో ట్యాబ్‌లో మార్కు చేస్తున్నారు. పలాస మండలంలో ని రాజగోపాలపురం, హిమగిరి, దానగోర, ఖైజోలా, సిరిపురం, లొద్దబద్ర, జగన్నాథపురం గ్రామాలలో పర్యటించి ఓటు వివరాలు రాసుకుంటున్నారు. అయితే ఎవరు సర్వే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని అనుమానంతో ప్రతి ఒక్కరూ ప్రశ్నించడంతో ఎక్కడి నుంచి వచ్చామో వారు వివరాలు చెప్పకపోవడంతో లొద్దబద్రలో వారిని నిలువరించారు. పలాస ఎంపీపీ కొయ్యి శ్రీనివాసరెడ్డితో పాటు, పైల చిట్టి, గొర్లె వేణుగోపాలరా వు, ఉంగ సాయికృష్ణ, తలగాపు నరసింహమూర్తి తదితరులు వారిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ ఎస్‌ఐ ఎంఎస్‌కే ప్రసాదరావు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా