పీఠమెక్కిన ఎంపీపీలు | Sakshi
Sakshi News home page

పీఠమెక్కిన ఎంపీపీలు

Published Sat, Jul 5 2014 4:47 AM

పీఠమెక్కిన ఎంపీపీలు - Sakshi

- అతివలకే అగ్రతాంబూలం
- టీడీపీ నేతల దౌర్జన్యంతో దేవరపల్లి ఎంపీపీ ఎన్నిక వాయిదా

ఏలూరు : జిల్లాలో మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల కొలువయ్యూరుు. 45 మండలాల్లో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శుక్రవా రం పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో 46 మండలాలు ఉండగా, 45 మండలాల్లో మాత్రమే ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగారు. దేవరపల్లిలో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండగా, టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు.

దీంతో ఎన్నికను వారుదా వేశారు. నిడదవోలు, వీరవాసరం, పోడూరు మండల పరిషత్ పీఠాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, మిగిలిన 42 స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. పెంటపాడు మండలంలో ఉపాధ్యక్ష పదవిని ఐదేళ్లలో నలుగురికి పంచే క్రమంలో టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది.
 
అతివలకే అగ్రస్థానం
జిల్లాలో 45 మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నిక నిర్వహించగా, 27 మండలాల్లో అధ్యక్ష పదవులను మహిళలే అధిష్టించారు. 18 మండలాల్లో అధ్యక్ష పదవులను పురుషులు అందుకున్నారు. కాగా ఉపాధ్యక్ష పదవుల్లో ఆరు మహిళలకు దక్కగా, పురుషులు 39 పీఠాలను దక్కించుకున్నారు.
 
 మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వీరే

Advertisement
Advertisement