సిక్కోలులో నయా జోష్‌ | Sakshi
Sakshi News home page

సిక్కోలులో నయా జోష్‌

Published Mon, Jan 7 2019 7:02 AM

TDP Leaders Join In YSRCP Srikakulam - Sakshi

ఇన్నాళ్లూ టీడీపీని నమ్మి అధికారం కట్టబెట్టిన శ్రీకాకుళం జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల దృష్టి ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై పడింది. మూడు దశాబ్దాలుగా పార్టీ కాడె మోసిన తమను పక్కనబెట్టి టీడీపీ నాయకులే పదవులు అనుభవించడంపైనా తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికొక ఆధారంగా కనిపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణతో అధికార పార్టీ నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ నవంబరు 25వ తేదీన జిల్లాలో అడుగుపెట్టింది మొదలు నేటివరకూ పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వేడి రానున్న సాధారణ ఎన్ని కల ముందు మరింత పెరుగుతుందనే సంతోషం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభం నుంచే శ్రీకాకుళం జిల్లాలో పాగా వేసింది. గత సాధారణ ఎన్నికలలో పాతపట్నం, రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికలలో నరసన్నపేట నియోజకవర్గంలోనూ విజయఢంకా మోగించింది. ఇక రానున్న ఎన్నికలలో జిల్లాలోని పదికి పది నియోజకవర్గాల్లోనూ విజయ దుందుభి మోగించడానికి సిద్ధమవుతోంది. దీనికితోడు పార్టీలోచేరికలు కూడా ఊపందుకున్నాయి.  

12.12.2018: ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాల్, ఇచ్ఛాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లాభాల స్వర్ణమణి వారి అనుచరులతో పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
18.12.2018: టెక్కలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
19.12.2018: టెక్కలి నియోజకవర్గం ఆర్‌హెచ్‌ పురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ఎన్ని మన్మధరావు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, నరసన్నపేట సమన్వయకర్త ధర్మాన కృష్ణదాస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
21.12.2018: పాతపట్నం నియోజకవర్గానికి చెందిన కలమట సుప్రియ (ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మరదలు), మాజీ సర్పంచ్‌ ఎస్‌.జనార్దన, డి.నాగరాజు తదితరులు పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
23.12.2018: టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ అల్లు మాధవ్‌ తన అనుచరులతో కలసి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
24.12.2018: పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన కొమ్మువలస సర్పంచ్‌ రెడ్డి లక్ష్మణరావు, ఉపసర్పంచ్‌ రెడ్డి సీతారాం, పొన్నాన తమ్మినాయుడు, రామారావు రావాడ రామారావు తదితరులు వారి అనుచరులతో పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
30.12.2018: ఆమదాలవలస నియోజకవర్గంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్‌ నేత పప్పల వెంకటరమణ (మున్నా) తన అనుచరులతో, మాజీ సర్పంచ్‌ ఖండాపు సత్యం, రాపాక సతీష్‌ తదితరులు తమ అనుచరులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
30.12.2018: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పార్టీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పలాస మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోట్ని లక్ష్మి, పలాస మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్ని దుర్గాప్రసాద్‌లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
31.12.2018: పలాస నియోజకవర్గంలో పలాసకు చెందిన టీడీపీలు నేత మడ్డు లక్ష్మీనారాయణ, పి.రవికుమార్, ఎ.ధనుంజయ, డి.వి.ధనరాజ్‌లు పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  

వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక
శ్రీకాకుళం అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పలువురు నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా ఆదివారం ఇచ్ఛాపురం నియోజకవర్గం, సోంపేట మండలంలో జింకిబద్ర క్రాస్‌ వద్ద  ఎల్‌ఎన్‌పేట మండలం మాజీ ఎంపీపీ శిమ్మ శ్రీదేవి, ఎంపీపీ ప్రతినిధి ఎస్‌.సాంబశివరావులు పార్టీలో చేరారు. వీరితోపాటు మాజీ సర్పంచ్‌లు శిమ్మ శ్రీరాములు, శిమ్మ తేజేశ్వరరావు, శిమ్మ కరువునాయుడు తదితరులు పార్టీలో చేరారు. వీరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలుస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ఒక భరోసా ఇస్తున్నారని, అందుకే ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకే పార్టీలో చేరడం జరిగిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement