వైఎస్సార్‌ సీపీలోకి క్యూ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి క్యూ

Published Fri, Dec 14 2018 7:20 AM

TDP Leaders Join in YSRCP West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : రాష్ట్రంలో తాజా పరిణామాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఏడాది కాలానికి పైగా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తోన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనం జై కొడుతున్నారు. జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని విస్తృతంగా పర్యటిస్తూ ప్రతి ఇంటికీ వెళుతూ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగటం ప్రజలను ఆకర్షిస్తోంది. ఇటీవల ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. ఆళ్ల నాని రూరల్‌ ప్రాంతంలోని గ్రామాల్లో పాదయాత్ర చేయటం, నగరంలో అన్ని డివిజన్లలోనూ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

భారీగా చేరికలు  
ఎమ్మెల్సీ ఆళ్ల నాని పాదయాత్ర, కార్యకర్తల సమావేశాల్లో ఆయా డివిజన్లలోనూ, గ్రామాల్లోనూ విశేష స్పందన వస్తోంది. ఇటీవల పవన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నగర గౌరవాధ్యక్షుడు, చిరంజీవి అభిమాన సంఘం జిల్లా నేత శానం రామకృష్ణ సైతం ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ప్రతిరోజూ డివిజన్లలో జరుగుతున్న కార్యకర్తల సమావేశాల్లో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు సైతం వైసీపీలో చేరిపోతున్నారు. తాజాగా ఏలూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో కె.ఆనంద్‌జీ, పి.రమణ ఆధ్వర్యంలో వందమందికి పైగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తూ ఆళ్ల నానికి మద్దతుగా భారీగా చేరికలు ఉండడంతో పార్టీ శ్రేణులకు బలాన్ని చేకూర్చుతోంది.పార్టీలో చేరిన వారిలో ఎస్‌కే ఇస్మాయిల్, ఎస్‌కే కరిముల్లా, మళ్ల వీరబాబు, సేనాపతి సతీష్, మంత్రి రాము, అగిరిపల్లి దుర్గారావు, ఆర్‌.నాగు, కె.నరేష్, ఎం.ఏసు, మంత్రి సత్తియ్య, మాండ్రపు ప్రసాద్, జి.దాము,తిరువూరి హరి, వానపల్లి అప్పలరాజు, దాసరి రాజేష్, ఎస్‌కే.బషీర్, ఎం.ప్రసాద్, జీ.రమేష్, మంత్రి నారాయణరావు, ఎం.శ్రీను,జి.నాగరాజు, ఎస్‌.రవళి, పీ.లక్ష్మి, మంత్రి రవణమ్మ, సేనాపతి బుచ్చయ్య, దాసరి అశోక్, మిండాల ఏసు, దాసరి రవి, దాసరి విజయ్, దాసరి నాగరాజు, ఎం.దావీడు, ఎం.రవి, పీ.జగ, ఎం.కోటయ్య, దాసరి పెద్దిరాజు, దాసరి దేవ, దాసరి క్రాంతి, మింగి సంతోష్, మింగి ఏసురాజు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement