Sakshi News home page

కానుకలు మాయం

Published Wed, Feb 17 2016 11:45 PM

TDP leaders joining the goods to homes

పక్కదారి పట్టిన లక్షల ప్యాకెట్లు
టీడీపీ నేతల ఇళ్లకు చేరిన సరుకులు
కొంతమంది డీలర్ల చేతివాటం
సరుకులు అమ్ముకున్నారంటూ విమర్శలు
 

చంద్రన్న కానుకలు మాయమైపోయాయి. దొడ్డిదారిన టీడీపీ నేతల ఇళ్లకు చేరాయి. రూ.లక్షల విలువైన వీటిని పప్పుబెల్లాల్లా పంచుకుతిన్నారు. కొన్నిచోట్ల డీలర్లు అమ్ముకున్నారు. చూసీచూడనట్టు వ్యవహరించి అధికారులూ ఉడత సాయం చేశారు.
 
విశాఖపట్నం :  చంద్రన్న కానుకలు పక్కదారిపట్టాయి. ఏకంగా 4లక్షలకు పైగా ప్యాకెట్లు మాయమైపోయాయి. వాస్తవానికి చాలా మందికి ఈ సరుకులు అందకపోయినా..ఈ-పాస్ ఇబ్బందుల వల్ల మాన్యువల్‌గా పంపిణీ చేశామని అధికారులు చెప్పుకొస్తున్నారు. జిల్లాలో 10.84లక్షల రేషన్‌కార్డులున్నాయి. గత నెలలో 1.43 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేశారు.1608 షాపుల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తున్నారు. వీటి పరిధిలో 9.51లక్షలకార్డులున్నాయి. గతేడాది  ఏప్రిల్‌లో శ్రీకారం చుట్టిన ఈధానం పుణ్యమా అని దాదాపు రెండున్నర లక్షల మంది కార్డుదారులు ప్రతీ నెలా సరకులు తీసుకోవడం లేదు. దీంతో 15 శాతం సరుకులు ఆదా అవుతున్నాయని జిల్లాయంత్రాంగం ప్రకటిస్తోంది. గతేడాది మాదిరి ఈఏడాది చంద్రన్న సంక్రాంతి కానుకలు ప్రభుత్వం పంపిణీ  చేసింది. ఈ ఏడాది కొత్తగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు ఇచ్చారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు వీటిని, జనవరి 6 నుంచి సంక్రాంతికానుకలు పంపిణీ  చేశారు. క్రిస్మస్ కానుకలు తీసుకున్న వారు మళ్లీ సంక్రాంతి కానుకలు తీసుకోడానికి వీల్లేని విధంగా ఈ-పాస్ అమలు చేశారు. ఇంత పగడ్బందీగా చేపట్టినప్పటికీ సరకులు పక్కదారి పట్టాయి. ఈ-పాస్ అమలవుతున్న 1608 షాపుల్లో ప్రతీ నెలా 7.50 లక్షల కార్డుదారులు నెలవారీ నిత్యావసర సరకులు తీసుకుంటున్నారు.

తీసుకోలేని వారికి జనవరి నుంచి నెలవారీ నిత్యావసరాల కేటాయింపులు నిలిపివేశారు. అదేస్థాయిలో చంద్రన్న కానుకలు కూడా మిగలాలి..కానీ ఏ ఒక్క సరుకు ఆస్థాయిలో మిగలలేదు. చంద్రన్న కానుకల పేరిట గతేడాది పామాయిల్ (అరలీటర్), కందిపప్పు (అరకిలో), శెనగపప్పు (కిలో), గోధుమపిండి (కిలో), బెల్లం (అరకిలో), నెయ్యి (100 గ్రాములు) కలిపి ఒక కిట్ రూపంలో కార్డుదారునికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈమేరకు కందిపప్పు 11,96,240 ప్యాకెట్లు, పామాయిల్ 11,96,277 ప్యాకెట్లు, శెనగపప్పు 11,96,241 ప్యాకెట్లు, బెల్లం 11,94,586 ప్యాకెట్లు, నెయ్యి 11,96,233, గోధుమపిండి 11,96,334 ప్యాకెట్లు జిల్లాకు కేటాయించాలి. కానీ 7.60లక్షల సంచులు మాత్రమే చేరాయి. వాస్తవానికి ఈ-పాస్ అమలవుతున్న 1608 షాపుల్లో నెలవారీ సరకులు తీసుకుంటున్న 7.50లక్షల మందికి మాత్రమే సరకులు సరఫరా చేయాల్సి ఉంది. అంటే ప్రతీసరకు రెండులక్షలకు పైగా ప్యాకెట్లు మిగలాలి. కానీ రికార్డుల ప్రకారం క్రిస్మస్ కానుకలుగా డిసెంబర్‌లో 3,50,070 మంది తీసుకుంటే.. సంక్రాంతి కానుకలుగా జనవరిలో 7,91,292 మంది తీసుకున్నారు. ఈలెక్కన 10.41లక్షల మంది సరకులు తీసుకుట్టు. కనీసం ఈ లెక్క ప్రకారమైనా 1.50లక్షల ప్యాకెట్లు మిగలాలి. కానీ ప్రతీ సరుకు 50వేల లోపే మిగిలాయి. కందిపప్పు-47,455, పామాయిల్-47,662, శెనగపప్పు 47,939,బెల్లం-45,951, నెయ్యి-47,599, గోధుమ పిండి-47,859 చొప్పున ప్యాకెట్లు మిగిలాయని పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక  పంపారు. ఈ లెక్కన ఏకంగా లక్షకు పైగా ప్యాకెట్లు గుటకాయస్వాహా అయినట్టుఅర్థమవుతోంది. వీటిలో ఎక్కువ సరకులు టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్లకు చేరితే... మిగిలినవి డీలర్లు దొడ్డిదారిన బహిరంగ మార్కెట్‌కు తరలించుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇదే విషయాన్ని సివిల్ సప్లయిస్ అధికారుల వద్ద ప్రస్తావిస్తే..ఈ-పాస్ మిషన్లు పనిచేయక పోవడంతో మాన్యూవల్‌గా పంపిణీ చేశామని సమర్ధించుకుంటున్నారు. నెలవారీ నిత్యావసర సరకులు తీసుకోని వారంతా బోగస్ కార్డులు కలిగి ఉన్నారనిపదేపదే ప్రకటిస్తున్న అధికారులు ఈ కానుకలు ఏ విధంగా వారుతీసుకున్నారో చెప్పలేక నీళ్లు నములుతున్నారు. మిగిలిన సరుకులను  ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, ఆతర్వాత ఎస్సీ, బీసీ హాస్టళ్లకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ముక్కిపోయిన కందిపప్పు, నీరుగారిపోతు న్న బెల్లం,.తవుడుమయమైన గోధుమపిండి ఇలా ప్రతీది నాసిరకం సరుకును కానుకల పేరిట అంటగట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నాసిరకం సరుకులను హాస్టళ్లకు పంపిణీ చేసి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడేందుకు రంగం సిద్ధమైంది.
 
ఈ-పాస్ పనిచేయలేదని ఇవ్వలేదు
ఈ- పాస్ పనిచేయడం లేదని సంక్రాంతి కానుక ఇవ్వడం లేదు. క్రిస్టియన్‌లకు చంద్రన్న కానుక, హిందువులకు సంక్రాంతి కానుక అని రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డిఫోల ద్వారా పంపిణి చేస్తున్న సరకులు కార్డు దారులకు సకాలంలో అందడం లేదు. అధికారులు స్పందించి అరకులోయలో ఈ-పాస్ విధానం రద్దు చేయాలి.
 - వై. సత్తిబాబు, అరకులోయ.
 
 

Advertisement

What’s your opinion

Advertisement