కరోనాతో మృతి చెందితే ఖననం చేయనివ్వరా? | Sakshi
Sakshi News home page

కరోనాతో మృతి చెందితే ఖననం చేయనివ్వరా?

Published Sat, Jul 18 2020 1:15 PM

TDP Leaders Stop Coronavirus Patient Funeral in Vizianagaram - Sakshi

విజయనగరం,పార్వతీపురంటౌన్‌: కరోనాతో మరణించిన వ్యక్తిని ఖననం చేయనివ్వకుండా అడ్డుకున్న సంఘటన పార్వతీపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీతానగరం మండలం తా మరఖండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో పా ర్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్సనిమిత్తం గురువారం చేరారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండడంతో వైద్యులు నిర్థారణ పరీక్షలు కూడా చేశారు. శుక్రవారం ఉదయం ఆయన దురదృష్టవశాత్తూ మరణించగా తరువాత కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపల్‌ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది శవ పంచనామా చేశారు. అనంతరం ఊరి చివర గల శ్మశా న వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు యత్నించా రు. ఇంతలో ఆ ప్రాంతంలోని కొందరు టీడీపీ నాయకులు కనీస మానవత్వం మరచి స్థానిక అమాయక ప్రజలను రెచ్చగొట్టి అడ్డుకునేందుకు యత్నించారు. కర్రలతో పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిపై దాడికి యత్నించారు. వెంట నే పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఐ జి.కళాధర్‌ వారితో మా ట్లాడి విషయాన్ని వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించి వారిని వారించారు. దాంతో అంతిమసంస్కారం సజావుగా సాగింది.

నిబంధనలేమంటున్నాయి...
కరోనాకు చికిత్స పొందుతూ ఏ వ్యక్తి అయినా మరణించినట్టయితే వారి మృతదేహాలను ఆ ఆస్పత్రికలిగిన ఊరి చివర ఉన్న శ్మశానాల్లో ఖననం చేయాలి. కానీ ఇవేవీ పట్ట ని టీడీపీ నాయకులు కేవలం స్థానికులను రెచ్చగొట్టి అమానవీయంగా వ్యవహరించడంపై స్థానికంగా విమ ర్శలు రేగుతున్నాయి. పార్వతీపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో చికిత్స పొందుతూ విశాఖలో మరణి స్తే వారికి అక్కడి శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ లేని అభ్యంతరం పార్వతీపురంలో తలెత్తడానికి కారణమైనవారిపై స్థానికులు మండిపడుతున్నారు.

భయపడాల్సిందేమీ లేదు
కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం నుంచి ఆరుగంటల తరువాత వైరస్‌ ఎంతమాత్రం విస్తరించదు. చనిపోయినవారిని ఆరున్న ర అడుగులకు పైబడి లోతున గో యి తీసి ఖననం చేస్తాం. దీనివల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగదు. ప్రజలంతా ఎవరో చెప్పిన మాటలు విని అపోహలకు పోవద్దు. కరోనా వైరస్‌ విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి.  – కె.కనకమహాలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్, పార్వతీపురం

Advertisement
Advertisement