టీడీపీ ఎంపీపీ భర్త ఆడియో సంభాషణలు హల్‌చల్‌ .. | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీపీ భర్త ఆడియో సంభాషణలు హల్‌చల్‌ ..

Published Sat, Sep 29 2018 2:11 PM

TDP MPP Husband  Audio Tapes Hull chal - Sakshi

చిత్తూరు,సాక్షి: పిచ్చాటూరు ఎంపీపీపై అవిశ్వాస రాజకీయాలు వేడెక్కాయి. బేరసారాలు మొదలయ్యాయి. పిచ్చాటూరు ఎంపీపీ మధుబాల (టీడీపీ)పై స్వపక్షానికి చెందిన మెజారిటీ సభ్యులు అవిశ్వాసానికి ప్రతిపాదించారు. మొత్తం తొమ్మి ది మంది ఎంపీటీసీలుండగా ఏడుగులు టీడీపీకి చెందినవారు. ఇద్దరు వైఎస్సార్‌సీపీకి చెందినవారు. టీడీపీలో లుకలుకలు రావడంతో మధుబాలకు ఏడుగురిలో ఆరుగురు దూరమయ్యా రు. అంతరాలు పెరిగిపోవడంతో ఆమెపై అవి శ్వాసానికి నోటీసిచ్చారు. దీంతో ఆమె ఒంట రైంది.

 అక్టోబరు 1వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో దీనిపై చర్చ ఓటింగు జరగనుంది. మరో రెండు రోజులే గడువుంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మధుబాల పక్షాన ఆమె భర్త పద్మనాభరాజు బేరసారాలకు దిగారు. సభ్యులతో మంతనాలకు దిగారు. నయానో భయానో తమవైపు తిప్పుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాయిలాలు కూడా ఇస్తామని చెబుతున్నారు. 

 సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే సభ్యులకు నోటీసులందాయి. గడువు సమీపించడంతో టీడీపీలోని మరో గ్రూపు కూడా పార్టీ మండల అధ్యక్షుడు ఇళంగోవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గేలా వ్యూహాలు పన్నుతోంది. అనుకూలంగా ఓటేయకపోయినా హాజరుకాకున్నా ఎంతో కొంత ముట్టజెబుతానని పద్మనాభరాజు మాటిస్తున్నట్లు తెలిసింది. అడవి కొడియంబేడు ఎంపీటీసీ  ప్రతాప్‌తో ఆయన చర్చిం చిన ఆడియో టేప్‌ ఇటీవల ఈ ప్రాంతంలో హల్‌చల్‌ చేస్తోంది. రాకున్నా చాలని చెప్పినట్లు అందులో ఉంది. సంభాషణలో కొంత భాగం ఇలా సాగింది. 

ఎంపీపీ భర్త:  నువ్వొచ్చి పలాంది చెయ్‌ అ ను.. నేను చేసి పెడ్తా అంతే.. పనా, ఇంకొకటా.. ఇంకొకటా.. ఫైనాన్సా.. ఏం చేయమంటే అది చేసిపెడతా.. నువ్వు (అవిశ్వాస తీర్మానానికి) రాకుండా ఉంటే చాలంతే..
 ఎంపీటీసీ సభ్యులు: సరే..నా..
 ఎంపీపీ భర్త: నేను చెప్పేదిను. ఇదేం శాశ్వతం కాదు.. మళ్లీ ఇంకోసారి.. ఇంకోసారి ఇంకేదైనా అవకాశం ఉంటాది. ఆపొద్దు కూడా నేను పట్టుబట్టి నీకు టికెట్టు తీయిచ్చి నీకు అన్నీ చేయిచ్చినాను.. నాకు ఈ సహాయం చేయంటే అది చేయిస్తానంతే.. నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా ..అంత వరకే.. 
ఎంపీటీసీ సభ్యులు: సరే ఓకె నా..
 ఎంపీపీ భర్త: అదీ ఒకే మాట.. 

Advertisement
Advertisement