బెజవాడలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం | Sakshi
Sakshi News home page

బెజవాడలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం

Published Wed, Feb 17 2016 2:53 AM

TDP state headquarters in Bezawada

సాక్షి, విజయవాడ బ్యూరో/ హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యకలాపాలన్నింటినీ ఇకపై విజయవాడ నుంచే నిర్వర్తించేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. ఇక్కడే రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు కోసం అన్ని వసతులూ ఉన్న అద్దె భవనం అన్వేషణలో నిమగ్నమైంది. మరోవైపు శాశ్వత భవన నిర్మాణం కోసం మంగళగిరి సమీపంలో స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఐదు ఎకరాల స్థలం కావాలని కోరినట్లు సమాచారం. స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి నెల రోజుల్లోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని టీడీపీ నేత ఒకరు చెప్పారు.

సోమవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిశాక సీఎం చంద్రబాబునాయుడు,  నారా లోకేశ్.. ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీలు వీవీవీ చౌదరి, టీడీ జనార్థన్‌లతో ప్రత్యేకంగా సమావేశమై విజయవాడలో పార్టీ కార్యాలయం  ఏర్పాటు అంశంపై చర్చించారు. మంగళవారం ఉదయం కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో లోకేశ్ మరోమారు పార్టీ నేతలతో సమావేశమై ఇదే అంశమై చర్చించారు. తాత్కాలికంగా అద్దె భవనం ఒకటి తీసుకుని నెల రోజుల్లోగా హైదరాబాద్‌లోని పార్టీ  విభాగాలను విజయవాడకు తరలించాలని  నిర్ణయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement