తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుంది: బొత్స | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుంది: బొత్స

Published Wed, Nov 6 2013 3:46 PM

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుంది: బొత్స - Sakshi

హైదరాబాద్: తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. తీర్మానాన్ని కూడా పంపించాలని కోరినట్టు వెల్లడించారు. రెండు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తెలంగాణపై తమ పార్టీ మొదటి నుంచి క్లారిటీతో ఉందన్నారు. పీసీసీ చీఫ్గా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని గౌరవిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని అన్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వాల్వో బస్సు జేసీ రోడ్ లైన్స్ పేరు మీద ఉందని బొత్స వెల్లడించారు. ఆర్టీఐ చట్టం ప్రకారం బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో 38 మృతదేహాలను గుర్తించామని తెలిపారు. 31 మృతదేహాలు బంధువులకు అప్పగించామన్నారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న బస్సులపై 601 కేసులు పెట్టామని, 340 బస్సులు సీజ్ చేశామని చెప్పారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement