‘తెలంగాణ’పై వైఖరి వెల్లడించాలి | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’పై వైఖరి వెల్లడించాలి

Published Wed, Aug 28 2013 3:55 AM

telangana 'report on the attitude

 కామేపల్లి, న్యూస్‌లైన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కాంగ్రెస్, టీడీపీలకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఈ రెండు పార్టీలు పగటి వేషాలు వేస్తున్నాయని, ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించా రు. మండలంలోని గరిడేపల్లిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని మంగళవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగి న సభలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై విధివిధానాలు లేకుండా తనఉనికిని కాపాడుకునేందుకే ప్రకటన చేసిందన్నారు. తెలంగాణపై వైఎస్‌ఆర్ సీపీ వైఖరిని ప్లీనరీలోనే ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక తెలంగాణతోనే ఈ ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ ఆవిర్భవించక ముందే 42 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ కెళ్లి కేంద్రానికి వినతిపత్రం ఇచ్చారని గుర్తు చేశారు. ై
 
 వెఎస్‌పై విమర్శలు చేసేముందు టీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయం తెలుసుకోవాలని సూ చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించగా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ వారే వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని, అలాంటి వారి ని పార్టీనుంచి ఎందుకు బహిష్కరించడం లేద ని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు చేస్తున్న ఉద్యమం చంద్రబాబుకు కనిపించడం లేదా అన్నారు. ఆ పార్టీ ఏనాడు తెలంగాణ కోసం వినతిపత్రాలు ఇచ్చి న దాఖలాలు లేవని విమర్శించారు. వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణను ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉందని అన్నారు. జగన్ కూడా తెలంగాణ ఇవ్వాలని కోరారని, ప్లీనరీలో ప్రకటించిన విధివిధానాలకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. 
 
 తెలంగాణలోనూ తమపార్టీ విజయం తథ్యమన్నారు. పార్టీ నుంచి ఒకరిద్దరు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. తామందరమూ పార్టీలోనే కొనసాగుతామన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందాలంటే జగన్ సీఎం కావాల్సిందేనని, ఆయనను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ భూక్య దళ్‌సింగ్, జిల్లా నాయకులు మందడపు వెంకటేశ్వరరావు, జిల్లేపల్లి సైదులు, ఏలూరి కోటేశ్వరరావు, జాటోత్ ఝాన్సీలక్ష్మీ, కామేపల్లి, ఇల్లెందు, గార్ల మండలాల కన్వీనర్లు రుద్ర హనుమంతరావు, పులి సైదులు, మీరాపఠాన్‌ఖాన్, గుండా వెంకటరెడ్డి, అప్పన పిచ్చయ్య, బోడా మీటూనాయక్, రాయల పెద్దవెంకటేశ్వర్లు, ఉప్పలపాటి శ్రీనివాసరావు, బాలాజీ, బోడా రాజేష్, మహేష్, సుంకర బిక్షం, ధరావత్ రాంజీ  పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement