‘స్థానిక’ పోరుకు సిద్ధం | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పోరుకు సిద్ధం

Published Tue, Mar 4 2014 12:18 AM

tension in leaders the cause of municipal elections in front of general elections

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు ముందే పురపాలక, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సోమవారం పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పురపాలక ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జాప్యం కావడంతో ఎట్టకేలకు న్యాయస్థానం ఆదేశం మేరకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇక స్థానిక చర్చ సందడి మొదలైంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులకు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం కానున్నాయి.

 ఓ పక్క పురపాలక ఎన్నికల పనుల్లో నిమగ్నమైన యంత్రాంగం జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఈ నెల 5లోగా  సిద్ధం చేయాలని ఆదేశాలు అందాయి. రిజర్వేషన్లను ఖరారు చేయడంలో అధికారులు తలమునకలు అయ్యారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు(జెడ్పీటీసీ)లు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ)ల రిజర్వేషన్ల ఖరారులో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తేలియాడుతున్నారు. జెడ్పీటీసీల రిజర్వేషన్ల ఖరారు జిల్లా స్థాయి అధికారులు చేపట్టగా, ఎంపీటీసీల రిజర్వేషన్లు మండల అభివృద్ధి అధికారులు(ఎంపీడీవో)లు సిద్ధం చేస్తున్నారు. అయితే రెండు టర్మ్‌లుగా కేటాయించిన ఎంపీటీసీ రిజర్వేషన్ల దస్త్రాలు ముందు పెట్టుకొని ఖరారు చేయాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలకే రిజర్వేషన్లు ఎక్కువ దక్కే అవకాశం కన్పిస్తోంది.


 జాబితా తయారీలో యంత్రాంగం
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు జాబితా తయారు చేయడంలో యం త్రాంగం నిమగ్నమైంది. ఇందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి న అనంతరం అధికారులు ప్రభుత్వానికి జాబితా పంపనున్నారు. ఈ జాబితా ప్ర కారం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జాబితాను పరిశీలన చేసిన అనంతరం ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేస్తుంది. గెజిట్ విడుదలైతే రిజర్వేషన్లు ఖరారైనట్లే..రిజర్వేషన్ల వివరాలను గెజిట్‌లో పొందుపరుస్తారు. జిల్లాలో 52 జెడ్పీటీసీ స్థానాలు, 52 అధ్యక్ష స్థానాలు, 636 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

 గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన అభ్యర్థుల పదవీ కాలం 2011తో ముగిసింది. గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలు 52ఉండగా, ఎంపీటీసీ స్థానాలు 569 ఉండేవి. ఎనిమిది నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో అప్పుడు ఎంపీటీసీ స్థానాల సంఖ్య 636కు చేరింది. అంటే కొత్తగా జిల్లాలో 67 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో గ్రామీణా ప్రాంతాల్లో చర్చమొదలైంది. పోటీ చేసే అభ్యర్థులు సైతం ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నారు. ఏదేమైనా మున్సిపల్. స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠగా మారనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement