తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే

Published Tue, Mar 4 2014 12:03 AM

the credit of telangana formation belongs to sonia gandhi

 జహీరాబాద్, న్యూస్‌లైన్:  జహీరాబాద్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకే దక్కుతుదని మాజీ మంత్రి జె.గీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి షెట్కార్ ఫంక్షన్‌హాల్‌లో  నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి  ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో సోనియా గాంధీ ఏ మాత్రం వెనుకకు తగ్గలేదన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్ధతు తెలిపే విషయంలో బీజేపీ రాజకీయంగా ఎత్తుగడలు వేసినా అవి పారలేదన్నారు.

 తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందున ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి అధికారం అప్పగించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోలేక పోతోందన్నారు. ఇతర పార్టీల నేతలు మాత్రం ఏమి చేయకున్నా అంతా తామే చేశామన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ఒక్క  కాంగ్రెస్ పార్టీయే అందించగలుగుతుందన్నారు. యువత సైతం రాహూల్‌గాంధీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి భర్త రాంచంద్రారెడ్డి, కుమార్తె మేఘనారెడ్డి, అల్లుడు సుధీర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కిషన్‌రావు పవార్, న్యాల్‌కల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, హన్మంత్‌రావు పాటిల్, ఆర్.అరవింద్‌రెడ్డి, కె.నర్సింహులు, ఎండీ ఖాజా, చంద్రశేఖర్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.

 విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డంకి
 కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డు పడింది. ర్యాలీ మధ్యలో ఉండగా భారీ వర్షం కురిసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. గంటపాటు వర్షం కురియడంతో ర్యాలీని అర్థంతరంగా నిలిపి వేశారు. వర్షం తగ్గిన అనంతరం సభను షెట్కార్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేశారు. దత్తగిరి కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ బ్లాక్‌రోడ్డు వరకు చేరుకోగానే వర్షం మొదలైంది. వర్షం ఎంతకూ తగ్గక పోవడంతో అర్థంతరంగా రద్దు చేసి సభ నిర్వహించారు.

 ఆడి పాడిన గీతారెడ్డి
  విజయోత్సవ ర్యాలీలో మాజీ మంత్రి గీతారెడ్డి ఆడి పాడారు. ర్యాలీలో మహిళలు బతుకమ్మను బోనాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడుతూ ఆడారు. తలపై బోనం ఎత్తుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ర్యాలీలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. గీతారెడ్డి అల్లుడు సుధీర్‌రెడ్డిని పార్టీ కార్యకర్తలు గుర్రంపై కూర్చోబెట్టి ఊరేగించారు.

. సోమవారం రాత్రి షెట్కార్ ఫంక్షన్‌హాల్‌లో  నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి  ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో సోనియా గాంధీ ఏ మాత్రం వెనుకకు తగ్గలేదన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్ధతు తెలిపే విషయంలో బీజేపీ రాజకీయంగా ఎత్తుగడలు వేసినా అవి పారలేదన్నారు.

Advertisement
Advertisement