దౌర్జన్యకాండ | Sakshi
Sakshi News home page

దౌర్జన్యకాండ

Published Sat, Jun 28 2014 3:18 AM

దౌర్జన్యకాండ - Sakshi

  • విత్తన పంపిణీపై టీడీపీ పెత్తనం
  •  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రారంభాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు
  •  యాదమరిలో ఘటన
  •  3 గంటల పాటు ధర్నా
  • అధికారంలోకి వచ్చి నెలరోజులు గడవకముందే టీడీపీ నేతల ఆగడాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రొటోకాల్‌తో పనిలేదు...రైతుల శ్రేయస్సు ముఖ్యం కాదు... రాజకీయంగా తమపంతం నెగ్గించుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యాదమరి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన విత్తన పంపిణీలో వారు చేసిన రభస అంతాఇంతాకాదు. ఈ ఘటనతో విత్తన పంపిణీ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

    సాక్షి, చిత్తూరు : వేరుశెనగ విత్తన పంపిణీ ప్రక్రియను ఈ నెల 25 నుంచిప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయాధికారులు ప్రకటించారు. యాదమరి మండలంలో ఈనెల 27న పంపిణీ చేయనున్నట్లు అక్కడి ప్రాథమిక సహకార సంఘం పత్రికలో ప్రకటన ఇచ్చింది. రైతులు విత్తనకాయల కోసం డబ్బులు లేక అప్పులు తెచ్చుకున్నారు. ఇంకొందరు బంగారు తాకట్టుపెట్టి నేరుగా పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చారు. అందుకు సంబంధించిన తాకట్టు పత్రాలు కూడా వెంట తెచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్, సొసైటీ చైర్మన్ శివకుమార్ వ్యవసాయ, సొసైటీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో విత్తన పంపిణీని ప్రారంభించారు. నాలుగు బస్తాలు పంపిణీ చేశారు.
     
    పంపిణీ ఆపాలన్న టీడీపీ నేతలు.. జీ హుజూర్ అన్న సొసైటీ కార్యదర్శి

    పంపిణీ మొదలవగానే సొసైటీ వైస్ చైర్మన్ పూర్ణ, టీడీపీ మండల కన్వీనర్ వినాయక గౌండర్, మాజీ ఎంపీపీ రాజమాణిక్యం, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు అమర్‌నాథనాయుడు అక్కడికి వచ్చారు. విత్తన పంపిణీని ఆపాలని హుకుం జారీ చేశారు. ‘ప్రభుత్వం మాది.. వైఎస్సార్‌సీపీ నేతలు వచ్చి ఎలా పంపిణీ చేస్తారు. మేమే విత్తన పంపిణీని ప్రారంభించాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు. విత్తనాలు ఇచ్చేది లేదు. రేపు మేం తిరిగి పంపిణీని ప్రారంభిస్తాం.

    అప్పటి వరకు విత్తనాలు ఇచ్చేది లేదు.’ అని గట్టిగా అరుస్తూ పంపిణీని అడ్డుకున్నారు. సొసైటీ కార్యదర్శి షణ్ముగం పంపిణీని నిలిపేశారు. వెంటనే రైతులు ఆందోళనకు దిగారు. పంపిణీని ఎందుకు నిలిపేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘విత్తన పంపిణీకి సొసైటీ సభ్యులు తీర్మానం చేయలేదని, కాబట్టి నిలిపేస్తున్నామనిరూ. అన్నారు. సాయంత్రం 4 గంటలకు సొసైటీ తీర్మానం చేసి పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే సునీల్ కూడా రైతులతోపాటు బైఠాయించి ఆందోళనకు దిగారు.
     
    రాజకీయ దర్పం కోసమే వాయిదా

    ప్రొటోకాల్ ప్రకారం విత్తన పంపిణీని స్థానిక ఎమ్మెల్యే, సొసైటీ చైర్మన్, అధికారులు చేపట్టాలి. దీనికి సొసైటీ తీర్మానం అవసరం లేదు. ఒకవేళ తీర్మానం అవసరమనుకుంటే ఈనెల 27న విత్తన పంపిణీ చేపడుతున్నట్లు పత్రికా ప్రకటన ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించారు? పంపిణీ ఎలా ప్రారంభించారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనికి సొసైటీ కార్యదర్శి షణ్ముగం వద్ద సమాధానం లేదు. కమిటీ ఆమోదం లేదు కాబట్టి పంపిణీ నిలిపేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని చివరకు షుణ్ముగం వాస్తవాన్ని కుండబద్దలు కొట్టారు.

    రాజకీయ ప్రాబల్యం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను అవమానించడం కోసం టీడీపీ నేతలు అడ్డుతగిలి, పంపిణీని నిలిపేశారని రైతులకు అర్థమైంది. ఁ్ఙపనులు మానుకుని, దూరప్రాంతాల నుంచి విత్తనాల కోసం వచ్చాం. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత రాజకీయ గొడవల కోసం రైతులను ఇబ్బంది పెట్టారు.రూ.రూ. అని ఆందోళనకు దిగారు. 3 గంటలపాటు ఆందోళన సాగింది. అయినా పంపిణీ ప్రారంభించలేదు. నిరాశగా రైతులు, ఎమ్మెల్యే సునీల్ వెనుదిరిగారు.
     

Advertisement
Advertisement