తొలి విడత రుణమాఫీకి రూ.157.17 కోట్లు | Sakshi
Sakshi News home page

తొలి విడత రుణమాఫీకి రూ.157.17 కోట్లు

Published Sat, Dec 13 2014 1:03 AM

తొలి విడత రుణమాఫీకి  రూ.157.17 కోట్లు

నిధులు విడుదల  ఎ త్వరలో మిగతా మొత్తం..
రుణమాఫీ వివరాలు వెల్లడించిన కలెక్టర్ యువరాజ్

 
విశాఖపట్నం : ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీలో భాగంగా జిల్లాలో తొలివిడతగా రూ.157.17కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ అయినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. జిల్లాలోని 43 మండలాల్లో పంట రుణాలు పొందిన రైతులను ఇప్పటికే గుర్తించి వారి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా  తొలివిడతలో రూ.349.34 కోట్ల మేరపంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

అయితే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు రూ.50వేల లోపు రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేస్తున్నామన్నారు. ఆపైన రుణాలున్న రైతులకు ఐదు వాయిదాల్లో 20శాతం చొప్పున వడ్డీతోసహా లక్షన్నర రూపాయల మాఫీ మొత్తం జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి విడతకు సంబంధించి తక్షణమే రూ.157.17కోట్ల విడుదల చేసిందని, మిగిలిన మొత్తాన్ని త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. ఈ మేరకు రుణవిముక్తి పత్రాలను ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతు సాధికారత సదస్సుల్లో సంబంధిత రైతులకు అందజేస్తున్నామన్నారు. మండలాల వారీగా రుణమాఫీ వివరాలు ఇలా ఉన్నాయి.
 
సందేహాల నివృత్తికి కాల్ సెంటర్
 
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తింపులో రైతులకు ఎదురయ్యే సందేహాలు, ఇబ్బందులను నివృత్తి చేసుకునేందుకు పరిష్కార్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ యువరాజ్ తెలిపారు. రుణమాఫీ అమలుకు సంబంధించిన వినతులను ఈ కాల్ సెంటర్‌లో అధికారులు స్వీకరిస్తారన్నారు. ఈ సెంటర్‌కు టోల్‌ఫ్రీ నంబర్లు 1100, 180004-254440, 180010-32066కు ఫోన్‌చేసి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని, ఫిర్యాదులు చేయవచ్చునని సూచించారు.

http://img.sakshi.net/images/cms/2014-12/61418412996_Unknown.jpg
 

Advertisement
Advertisement