నీరాజనం | Sakshi
Sakshi News home page

నీరాజనం

Published Sun, Jul 26 2015 1:04 AM

The last day to narasapur

నరసాపురం అర్బన్ : నరసాపురంలో శ నివారం జన కెరటాలు ఎగిసిపడ్డాయి. పట్ణణంలో ఏ వీధి చూసినా జనమే. అందరి పయనం గోదావరి ఘాట్లవైపే సాగింది. పుష్కర మహాసంబరం చివరిరోజు కావడంతో భ క్తులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే ఘాట్లన్నీ రద్దీగా మారిపోయాయి. ఘాట్లకు వచ్చే రహదారులు జనంతో నిండిపోయాయి. వలంధరఘాట్, లలితాంబ, కొండాలమ్మ, అమరేశ్వర్ ఘాట్లు జనంతో కిక్కిరిశాయి. రూరల్ పరిధిలోని ముస్కేపాలెం, లక్ష్మణేశ్వరం, దర్భరేవు, పీచుపాలెం, బియ్యపుతిప్ప ఘాట్‌ల వద్ద కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఘాట్లకు చేరుకున్న భక్తులు స్నానాలు చేయడానికి అరగంట సమయం వరకు పట్టింది. ఉదయం పూట పాటు కారణంగా గోదావరిలో నీరు లేకపోవడంతో భక్తులు జల్లు స్నానాలు ఆచరించారు. మహిళలు, వృద్ధులు, పెద్దసంఖ్యలో స్నానాలు చేశారు. విపరీతమైన వేడి, ఉక్కపోత ఉన్నప్పటికీ అశేష జనం భక్తి ముందు అవేమీ నిలబడలేదు. దాతలు, స్వచ్ఛంద సంఘాలు భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు.   

 22 లక్షల మందికి పైగా స్నానాలు
 గోదావరి పుష్కర సంబరం ముగిసింది. అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ యాత్రికులు పుష్కరాలకు పోటెత్తారు. నరసాపురం రేవుల్లో 22 లక్షలకు మందికి పైగా స్నానాలు చేశారు. ప్రతిరోజూ 1.50 లక్షలకు మంది వరకూ స్నానాలు చేశారు. 2003 పుష్కరాల్లో నరసాపురంలో 5 లక్షల మంది వరకు స్నానాలు చేసినట్టు అంచనా. ఈ పుష్కరాల్లో భక్తుల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. 12 రోజులూ నరసాపురంలో ఉన్న అన్ని ఘాట్లలో 22,10,059 మంది పుష్కర స్నానాలు చేశారని అధికారులు లెక్కలు కట్టారు.
 
 తేదీ=    హాజరైన భక్తులు
 14=    1,062,248
 15=    1,46,228
 16=    1,39,340
 17=    1,42,649
 18=    3,18,396
 19=    2,06,974
 20=    1,72,147
 21=    1,19,658
 22=    1,80,636
 23=    1,75,124
 24=    1,66,981
 25=    3,35,138
 
 కిక్కిరిసిన కొవ్వూరు
 టోల్‌గేట్ (కొవ్వూరు) : గోదావరి పుష్కరాల సందర్భంగా కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి స్నానఘట్టం భక్తులతో కిటకిటలాడింది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యాహ్నానికి స్నానఘట్టానికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. అన్ని స్నానఘట్టాల్లో భక్తుల సందడి నెలకొంది. సాయంత్రం ఆరు గంటలకు భారీ సంఖ్యలో మహిళలు గోష్పాదక్షేత్రానికి చేరుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపాలు వెలిగించి గోదావరి మాతకు నీరాజనం అర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాతకు పూజలు చేశారు.
 
 తాళ్లపూడికి యూత్రికుల తాకిడి
 తాళ్లపూడి : పుష్కరాల చివరిరోజు తాళ్లపూడి మండలంలోని ఘాట్లకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్నానమాచరించారు. గోదారమ్మ సంబరాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆఖరిరోజు కావడంతో గోదావరికి ఉదయం నుంచి హారతులు ఇచ్చి ఘనంగా ముగింపు పలికారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేగేశ్వరపురం, ప్రక్కిలంక, తాళ్లపూడి, తాడిపూడి, బల్లిపాడు ఘాట్ల వద్దకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేశారు. శనివారం సుమారు 55 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు.
 
 కోడేరు కిటకిట
 కోడేరు (ఆచంట) : పుష్కరాల చివరి రోజున ఊహించినట్టుగానే కోడేరు పుష్కరఘాట్ భక్తులతో పోటెత్తింది. నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. చివరిరోజు కావడంతో గోదార మ్మకు భక్తిశ్రద్ధలతో గంగ పూజలు నిర్వహించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఘాట్లలోకి ఎగువ నుంచి నీరు పెద్దఎత్తున చేరడంతో భక్తులు ఉత్సాహంగా పుష్కరస్నానాలు ఆచరించారు. మండలంలోని కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్లు భక్తులతో కళకళలాడాయి. కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్ల వద్ద దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
 
 జనసంద్రమైన తీపర్రు
 పెరవలి : గోదావరి పుష్కరాలు చివరిరోజైన శనివారం పుష్కర ఘాట్‌లకు భారీగా పోటెత్తారు. ఏ పుష్కర ఘాట్ చూసినా ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు రావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. ఒకవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు జనసంద్రాన్ని చూసి హడలిపోయారు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రూపులు గ్రూపులుగా పుష్కర పుణ్య స్నానాలకు భక్తులను నదిలోకి దింపి స్నానాలు చేయించారు. తీపర్రు పుష్కర ఘాట్‌కు 90 వేల మంది, ఖండవల్లికి లక్షకు పైగా, ఉసులుమర్రు 15 వేలు, కానూరు అగ్రహారానికి 20 వేలు, కాకరపర్రులో 35 వేలు, ముక్కామలలో 80 వేలు, ఉమ్మిడివారిపాలెంలో 60 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనాలు వేశారు.
 
 సిద్ధాంతంలో జన ప్రవాహం
 సిద్ధాంతం (పెనుగొండ రూరల్) : గోదావరి పుష్కరాలకు సిద్ధాంతంలో మహా ముగింపు పలికారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పుణ్యస్నానాలు చేస్తూ గోదారమ్మకు భక్తులు నిరాజనం పలికారు. శనివారం ఆఖరిరోజు కావడంతో భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. వేకువజాము నుంచి రాత్రి వరకు పుణ్యస్నానాలు జరుగుతూనే ఉన్నాయి. రికార్డుస్థాయిలో భక్తులు తరలిరావడంతో సిబ్బంది చెమటోడ్చారు. భక్తులతో నాలుగు ఘాట్లు కిక్కిరిశారుు. శనివా రం ఒక్కరోజే 1.50 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నా రు. భక్తుల సంఖ్య అధికంగా వచ్చి నా సిద్ధాంతం గ్రామస్థులు ఆతి థ్యంలోనూ మిన్న అని నిరూపించుకొన్నారు. ప్రతి ఒక్కర ూ ఎవరి స్తోమతను బట్టి వారు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. మం చి నీరు, పాలు, టీ, వేడినీళ్లు, అల్పాహారం, భోజ నాలు, ప్రసాదాలు ఇలా అన్నింటిని దాతలు ఇతోధికంగా పంపిణీ చేశారు.  
 
 పట్టిసీమకు పోటెత్తారు
 పోలవరం : పుష్కరాలు చివరిరోజైన శనివారం పట్టిసీమ రేవుకు భక్తులు పోటెత్తారు. వరుసగా 3వ రోజు కూడా లాంచీలు తిరగకపోవటంతో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం లేక భక్తులు నిరాశతో వెనుదిరిగారు. గోదావరిలో వరద నీరు పెరగడంతో పట్టిసీమ రేవులో పుష్కర ఘాట్ మెట్లపైనే పుష్కర స్నానాలు చేయాల్సి వచ్చింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
 
 గోదావరి పెరగటంతో మహానందీశ్వర క్షేత్రానికి వెళ్లే రోడ్డు మార్గం కూడా మునిగిపోయింది. పట్టిసీమతో పాటు పోలవరం తాత్కాలిక ఘాట్లలో,   గూటాల ఆంజనేయస్వామి ఘాట్‌లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేశారు. పట్టిసీమలో సుమారు 50 వేల మంది మిగిలిన ఘాట్‌లలో మరో 50 వేల మంది పుష్కరస్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement