పాత బస్సులకు కొత్త ‘కలర్’ | Sakshi
Sakshi News home page

పాత బస్సులకు కొత్త ‘కలర్’

Published Wed, Jan 28 2015 1:28 AM

పాత బస్సులకు కొత్త ‘కలర్’ - Sakshi

సీఎం ప్రారంభించిన 100 బస్సుల్లో 20 పాతవి
సాక్షి, విజయవాడ: పాత బస్సులకు రంగులు వేసి కొత్తగా మార్చేసి వాటిని సీఎం చంద్రబాబుతో ప్రారంభింప జేయించి ఔరా అనిపించారు ఏపీ ఆర్టీసీ అధికారులు. సోమవారం సీఎం విజయవాడలో వంద కొత్త బస్సులను ప్రారంభించిన సంగతి విదితమే. వీటిలో 20 పాత బస్సులకు రంగు వేసి, పూలతో అలంకరించి, స్టిక్కర్లు వేసి అధికారులు ముస్తాబు చేశారు. వాటినే సీఎం ప్రారంభించాఉ. వీటిని రీజియన్ల వారీగా కేటాయించి ఆయా డిపోలకు పంపారు.
 
 సీఎం వద్ద మెప్పుకోసం అధికారులు ఇలా ‘కలరింగ్ ’ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొన్నవి 89 బస్సులనీ , పాత వాటికి రంగులు వేసి 100 బస్సులుగా భ్రమింపజేశారని తెలుస్తోంది. దీనిపై విజయవాడ రీజియన్ మేనేజర్ సుదేశ్‌కుమార్‌ను వివరణ అడగ్గా 89 బస్సులు కొత్తగా ఆర్టీసీ కొనుగోలు చేసిందని, పాత బస్సులకు కొత్తగా పెయింట్ వేయలేదని చెప్పారు. సుమారు రూ. 60 కోట్లతో వీటిని కొనుగోలు చేశామన్నారు.

Advertisement
Advertisement