ప్రతిపక్షం గొంతునొక్కుతున్న అధికార పార్టీ | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షం గొంతునొక్కుతున్న అధికార పార్టీ

Published Mon, Mar 23 2015 1:20 AM

The opposition to the ruling party gontunokkutunna

వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు
 
వినుకొండ: ప్రతిపక్షం గొంతు నొక్కి అసెంబ్లీని అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని పల్నాడురోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారెడీ మాత్రమేనని తప్పులు లెక్కలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి దగా చేశారని విమర్శించారు. అధికారపక్షం అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు వ్యక్తిగత ఆరోపణలను ఏకైక మార్గంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్ ఎవరికి మేలు చేసేలా లేదని కేవలం కాంట్రాక్టర్లకు కోసమే అన్న విధంగా బడ్జెట్‌ను రూపొందించార ని ఆరోపించారు. రైతులకు మొండి చేయి చూపించారన్నారు. రైతులు దయనీయ పరిస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారణమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని బాబు వస్తే జాబు వస్తుందన్నారు. జాబు వచ్చేంది ఎలా ఉన్న ఉన్న జాబులను పీకేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేదు. డ్వాక్వా సంఘాలకు, చేనేత కార్మికులకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డున పడ్డా వారి గోడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఫీజులు కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. వరికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తానని బీసీ ఓట్లు వేయించుకుని వారిని దగా చేశారన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతలచెర్వు వెంకిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, శావల్యాపురం కన్వీనర్ చుండూరు వెంకటేశ్వర్లు, చీరపురెడ్డి కోటిరెడ్డి , పట్టణ కన్వీనర్ నరాలశెట్టి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ చింతా ఆదిరెడ్డి, జిల్లా కార్యదర్శి డూమావత్ గోవిందునాయక్, మాజీ సర్పంచ్‌లు గంధం బాలిరెడ్డి, దండు చెన్నయ్య, పీఎస్ ఖాన్, మాజీ కౌన్సిలర్ చల్లా కొండయ్య, కాల్వ రవిరాజు, ఎపిపి పట్రా కోటేశ్వరరావు, ఎంఎల్ రెడ్డి, ఎన్ వెంకటేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి, శ్రీలక్ష్మీ, శ్రీరెడ్డి, గుత్తా కోటేశ్వరరావు, గురవయ్య, శ్రీనివాసరెడ్డి, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement