మరమ్మతు..ఓ తంతు | Sakshi
Sakshi News home page

మరమ్మతు..ఓ తంతు

Published Mon, Jan 13 2014 3:38 AM

మరమ్మతు..ఓ తంతు

ఉప్పునుంతల, న్యూస్‌లైన్: ఆ చెరువు నిండితే రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకుంటారు. భూగర్భజలాలు పెరిగితే రెండేళ్లవరకు బోరుబావుల్లో నీటికి ఢోకా ఉండదు. కానీ నిధులున్నా ఆులు ఆం చెరువుకు నాలుగేళ్లుగా మరమ్మతులు లేవు. పనులు ఓ తంతుగా సాగుతున్నా పట్టించుకునేవారు లేరు. చెరువులో ఉన్న నీరంతా వృ థాగా పారుతుండటం..పొరుగూరి రైతులు రబీనాట్లు వేస్తుం డటం చూసి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 మండలంలోని మామిళ్లపల్లి ఊరచెరువు కింద 154 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నిండితే గ్రామానికి చెందిన 80 మంది రైతులు ఏడాదికి రెండుపంటలు పండించుకునేవారు. అయితే 2009లో కురిసిన భారీవర్షాలకు చెరువు తెగిపోయింది. మరమ్మతుల కోసం 2010లో వరదనష్టం నిధులు రూ.33.60లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను కాంట్రాక్టర్ కల్వకుర్తికి చెందిన ఓ సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. గతంలో ఏమాత్రం అనుభవంలేని వారు సకాలంలో పనులు పూర్తిచేయలేకపోయారు.
 
 ఆలస్యంగా 2012లో పనులు ప్రారంభించినా పునాదిలో వేసిన కాంక్రీట్‌లో నాణ్యతలేదని క్వాలిటీకంట్రోల్ అధికారులు పనులను నిలిపేశారు. వారి సూచనమేరకు అందులో కొంతమందం కాంక్రీట్‌ను తొలగించి తిరిగి పనులు చేపట్టారు. ఇలా చెరువు పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఇలా ఇప్పటివరకు రూ.10లక్షలు ఖర్చుచేశారు. ఐదడుగుల మేర కాంక్రీట్ వాల్ నిర్మించడంతో చెరువులోకి వచ్చిన వరదనీరంతా ఎక్కిపారి దిగువకు పారుతోంది. దీంతోపాటు కాంక్రీట్ గోడ అంచువెంట ఉన్న మట్టికట్ట కోతకు గురై చెరువులో ఏమాత్రం నీరు నిల్వకుండా పోయింది.
 
 బీడుగా ఆయకట్టు
 మరమ్మతులకు నిధులు మంజూరై నాలుగేళ్లు గడుస్తున్నా పనులు పూర్తిచేయడంలో ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టరు నాన్చుడిధోరణి అవలంభించారు. వారి నిర్లక్ష్యం కారణంగా చెరువులో ఉన్న నీరు దిగువకు వృథాగాపోయింది. దీంతో నీళ్లులేకపోవడంతో వందెకరాలను రైతులు బీడుగా ఉంచాల్సి దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఇటీవల గ్రామానికి వచ్చిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావుకు స్థానిక సర్పంచ్ దామోదర్, ఆయకట్టు రైతులు చెరువు మరమ్మతులపై ఫిర్యాదుచేశారు. అయినా అధికారుల్లో ఏమాత్రం స్పందన కని పించడం లేదు.  దీంతో పచ్చనిపంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఏ గ్రా మంలో చూసినా చెరువులు నీటితో నిండి రబీలో వరిపంట సాగుకు రైతులు సన్నద్ధమవుతుంటే ఇక్కడ మాత్రం చెరువులో నీళ్లులేక పంటలు వేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతుపనులను పూర్తిచేయాలని వారు కోరుతున్నారు.
 
  పూర్తిచేయిస్తాం..
 చెరువు మరమ్మతు పనులు పూర్తి చేయించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ఇరిగేషన్ డీఈఈ మనోహర్ తెలిపారు. సబ్ కాంట్రాక్టుకు తీసుకున్న వారు పనులపై నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. పనులకు కావాల్సిన ఇసుక, కంకర కూడా సేకరించినట్లు తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో పనులు ప్రారంభించి ఈ దఫా పూర్తిచేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement