కొండల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం తొలగింపు | Sakshi
Sakshi News home page

కొండల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం తొలగింపు

Published Sun, Sep 20 2015 12:34 AM

కొండల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం తొలగింపు - Sakshi

ఎం.సూరవరం (ఆగిరిపల్లి) :  సూరవరం పంచాయతీ పరిధిలోని శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వరస్వామి ఆలయం సమీపంలోని సూరవరం కొండల్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని తొలగించారు.  ఆరడగుల ఎత్తులో ఉన్న చాముండీ దేవి విగ్రహ ఏర్పాటుపై ఈ నెల 14న సాక్షిలో ‘సూరవరం కొండల్లో అమ్మవారి విగ్రహం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు.  విగ్రహంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విగ్రహాన్ని నాలుగు దిక్కుల్లో ఏ దిశలోను ప్రతిష్టించకుండా సూరవరం గ్రామానికి ఎదురుగా ప్రతిష్ఠించడంతో ఆందోళనకు గురైన సూరవరం, కొమ్మూరు గ్రామస్తులు ఆ ప్రాంతం నుంచి అమ్మవారి విగ్రహం తొలగించాలని తీర్మానించారు.  వీరవల్లి హైవేలో పంచముఖ ఆంజనేయస్వామి ఆల యంలో పూజలు నిర్వహించే  వడ్లమానుకు చెందిన జలసూత్రం రామాంజనేయులు ఈ ప్రాంతానికి రావడంతో పోలీసులు అతడిని విచారించారు. అటవీశాఖకు చెందిన ప్రాంతంలో ప్రతిష్టించడంతో విగ్రహాన్ని తొలగించేందుకు శనివారం మధ్యాహ్నం ముహుర్తాన్ని ఖరారు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా బెల్టులతో కట్టి, విగ్రహం చుట్టూ ఉన్న  కాంక్రీట్ పునాదిని తొలిచి, పొక్లెయిన్ సహకారంతో అక్కడి నుంచి తొలగించారు.

 నరబలి, జంతు బలి చేశారంటూ పుకార్లు
  విగ్రహం కింద భాగంలో చిన్న పిల్లాడిని, జంతువుల ను  బలిచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటూ పుకార్లు చేశాయి. విగ్రహం తొలగింపు పూర్తి అయిన తరువాత  అంతా కలియచూడగా రాగిరేకు మాత్రం కనిపించి నట్లు శోభనాపురం ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు.  సగ్గూరు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయానికి విగ్రహాన్ని తరలించామన్నారు.

Advertisement
Advertisement