బడ్జెట్‌పై పాలక, ప్రతిపక్షాల ఫైట్ రూ.486 కోట్లతో ఆమోదం
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రెవెన్యూ బడ్జెట్ సమావేశంలో అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నాయి. పన్ను భారాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి. పన్నుల బాదుడు లేకుండానే అదనపు ఆదాయాన్ని తెచ్చి చూపిస్తానని మేయర్ కౌంటర్ ఇచ్చారు. కార్పొరేషన్ రెవెన్యూ బడ్జెట్ సమావేశం బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.486 కోట్ల 94 లక్షల 27 వేల 327 బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఈ సమావేశం పాలక, ప్రతిపక్షాల మాటల తూటాల నడుమ వాడీవేడిగా సాగింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బి.నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ.. ఆస్తి పన్ను రూ.74 కోట్ల నుంచి రూ.132 కోట్లకు పెంచడాన్ని తప్పుబట్టారు.
పన్నుల బాదుడుకు మేయర్ శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.120 కోట్లు చూపారు కదా.. ఇప్పటివరకు ఎంత వసూలుచేశారని ప్రశ్నించారు. డిప్యూటీ కమిషనర్ డి.వెంకటలక్ష్మి మాట్లాడుతూ రూ.74 కోట్ల సాధారణ డిమాండ్‌లో రూ.55 కోట్లు వసూలయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 30 కోట్లు, వివిధ కోర్టు కేసుల పరిష్కారం అయితే రూ.8 కోట్లు వసూలవుతాయన్నారు. వీటన్నింటినీ గత బడ్జెట్లో చూపామన్నారు. మీరు పాతవే సక్రమంగా వసూలు చేయకుండా కొత్తగా రూ.132 కోట్లు వస్తోందని అంచనాల్లో చూపడం వల్ల ఉపయోగం ఏమిటని పుణ్యశీల ప్రశ్నించారు. దొడ్డిదారిన పన్నులు పెంచేందుకు పాలకపక్షం పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణించారు.
ఆదాయం పెంచుతాం
ప్రతిపక్షాలది పసలేని వాదనగా మేయర్ కొట్టిపారేశారు. రాజధానిగా నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతాయన్నారు. తద్వారా ఆస్తిపన్ను పెరుగుతుందన్నారు. నగరంలో చేపట్టిన సమగ్ర సర్వేలో లొసుగులు బయటపడుతున్నాయన్నారు. ఇప్పటివరకు 31,158 అసెస్మెంట్లను సర్వే చేస్తే 648 గృహాల వారు పన్ను చెల్లించడం లేదని, 7,699 మంది చెల్లించాల్సిన దానికంటే తక్కువ చెల్లిస్తున్నారని తేలిందన్నారు. వీటిన్నింటినీ సరిచేస్తే ఆదాయం ఎందుకు పెరగదన్నారు. గతంలో 27 వేల డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్స్‌ల ద్వారా రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక 32,700 ట్రేడ్స్ నుంచి రూ.6 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకారం నగరంలో 65 వేల ట్రేడ్స్ ఉన్నాయన్నారు. వీటన్నింటి నుంచి పన్నులు రాబట్టగలిగితే రూ.10 కోట్ల ఆదాయం కచ్చితంగా వస్తుందని చెప్పారు. సింగ్‌నగర్, జక్కంపూడి, వన్‌టౌన్ ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్ల ద్వారా ఆదాయాన్ని రాబడతామన్నారు. నగరంలో 31 వేల ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 12 వేల స్థలాల నుంచే పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎలా పెరిగాయో చెప్పండి!
సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ తాజా బడ్జెట్లో రూ.148 కోట్ల మేర ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. దీనిపై మేయర్ ఆగ్రహించారు. ఆ మేర పన్నులు ఎలా పడ్డాయో సభకు వివరించాలన్నారు. అనూహ్య పరిణామంతో సీపీఎం సభ్యురాలు కంగుతిన్నారు. కార్పొరేషన్లో మాట్లాడటం, ప్రెస్‌మీట్ పెట్టడం చాలా తేలిక, నోరుంది కదా అని ఆరోపణలు చేయొద్దంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు.
రూ.600 కోట్లు తూచ్
సమగ్ర సర్వే ద్వారా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఎలా ప్రకటించారో చెప్పాలని పుణ్యశీల నిలదీశారు. తాను ఎప్పుడూ అలా చెప్పలేదని మేయర్ సమాధానమిచ్చారు. అధికారులు మాత్రమే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారన్నారు. సకాలంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో పాలకపక్షం విఫలమైందని, వాస్తవ విరుద్ధంగా ఉన్న బడ్జెట్‌ను తాము ఆమోదించడం లేదని పుణ్యశీల, ఆదిలక్ష్మి అన్నారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇది ప్రజారంజక బడ్జెట్ అని అభివర్ణించారు. కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. క్యాపిటల్ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. పాలకపక్షం సభ్యులు బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ జి.వీరపాండియన్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, వీరమాచినేని లలిత, షేక్ బీజాన్బీ, కోఆప్షన్ సభ్యులు సిద్ధం నాగేంద్రరెడ్డి, సి.ఉషారాణి తదితరులు మాట్లాడారు.
ఢీ అంటే ఢీ
Published Thu, Mar 5 2015 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement