‘గీతాంజిలి’కి సీక్వెల్ తీస్తా.. | Sakshi
Sakshi News home page

‘గీతాంజిలి’కి సీక్వెల్ తీస్తా..

Published Fri, Aug 29 2014 3:31 AM

‘గీతాంజిలి’కి సీక్వెల్ తీస్తా..

  •    స్టోరీ, డెరైక్టర్ రాజ్‌కిరణ్
  •    రూ.4కోట్లు ఖర్చు పెట్టాం.. రూ.12కోట్లు సంపాదించాం..
  •   కథను శ్మశానంలో కూర్చుని రాశా..
  •   అమలాపాల్, స్వాతి చెయ్యనంటేనే.. అంజలిని ఎంచుకున్నాం..
  •   ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది..
  • ఘనవిజయం సాధించిన హర్రర్, కామెడీ చిత్రం గీతాంజలికి తర్వలో సీక్వెల్ తీస్తానని రాజ్‌కిరణ్ చెప్పారు. తనను సినీ రంగానికి పరిచయం చేసిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)ను గురువారం ఆయన ఆటపాకలోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ సందర్భంగా ఎంపీ మాగంటి బాబు దర్శకుడు రాజ్‌కిరణ్‌కు స్వీటు తినిపించి అభినందించారు. అనంతరం రాజ్‌కిరణ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందిన గీతాంజలి సినిమా నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికి రూ.12 కోట్లు వసూలు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తాను చూసిన ఓ యదార్థ సంఘటనను గీతాంజలి సీక్వెల్-2గా తెరకెక్కించనున్నట్లు రాజ్‌కిరణ్ తెలిపారు.

    గీతాంజిలి కథను ఓ శ్మశానంలో కూర్చుని రాశానని చెప్పారు. మొదట్లో టూలెట్, తర్వాత బాలాత్రిపురసుందరి పేర్లు అను కున్నామని, చివరికి అంజలి కథనాయిక కావడంతో గీతాంజలిగా మార్చామని తెలిపారు. తొలుత సినిమా హీరోయిన్‌గా అమలాపాల్, కలర్ స్వాతిలను అడిగితే, వారు శ్రీనివాసరెడ్డితో నటించడానికి సుముఖత చూపలేదన్నారు. నిర్మాత కోన వెంకట్ తనకెంతో సహాయం చేశారన్నారు.
     
    తాటికాయంత టాలెంట్‌కు ఆవగింజంత అదృష్టం ఉండాలి

    గీతాంజలి సినిమాలో చెప్పినట్టుగా ‘తాటికాయంత టాలెంట్‌కు ఆవగింజంత అదృష్టం ఉండాలి..’ అని రాజ్‌కిరణ్ చెప్పారు. స్థానిక డిగ్రీ కాలేజీ, విద్యాంజజి జూనియర్ కాలేజీ విద్యార్థులతో గురువారం ఆయన ముచ్చటించారు. తాను ఇదే ఊరిలో బాలాజీగా వినాయక స్డూడియోను నడిపానని, సినిమాలపై మోజుతో వెంకటరమణ థియేటర్ ప్రొజక్టర్ ఆపరేటర్ దగ్గర పనిచేశానన్నారు. కొద్దికాలం బాలాజీ మ్యూజికల్స్ నైట్స్ పేరుతో కచేరీలు కూడా చేశానని ఆయన వివరించారు.
     

Advertisement
Advertisement