రాయవరం : భానుడు రోజు రోజుకు విశ్వరూపం చూపిస్తున్నాడు. మండే ఎండలను తట్టుకునేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. నేడు మారిన జీవనశైలిలో భాగంగా వాహనాల పట్ల కూడా కాస్త జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా పార్కింగ్ లేకపోవడంతో ఎండలోనే వాహనాలు ఉంచడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర్ పంక్చర్ కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ఇంజన్ ఆయిల్ మార్పిడిలో అప్రమత్తం ..
వేసవిలో వాహనాల ఇంజన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి కారణంగా ఇంజన్ ఆయిల్ ఆవిరయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు వచ్చే వేడి .. ఎండ వేడి కలిసి ఇంజన్ ఓవర్‌హీట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంజన్ నుంచి పొగలు వస్తుంటాయి. దీంతో పాటు ఎయిర్ లాక్ ఏర్పడి వాహనం స్టార్ట్ కాక మొరాయించే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇంజన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. సాధారణంగా 2వేల కి.మీలకు ఒకసారి మార్చే ఇంజన్ ఆయిల్‌ను వేసవిలో 1,000 నుంచి 1,500 కిలో మీటర్లకు మార్చుకోవడం మంచిది.
రక్షణ నిచ్చే సీట్ కవర్లు.. క్లాత్ కవర్లు
ఎండ తీవ్రతను తగ్గించడంలో సీట్ కవర్లది ప్రముఖ పాత్ర ఉంటుంది. కేవలం సీటుకే కాకుండా పెట్రోల్ ట్యాంక్‌కు కూడా కవర్లు వేయడం మరింత సురక్షితం. వేడిని తగ్గించే వెల్వెట్, పోస్ట్క్లాత్ వంటి సీట్ కవర్లు వేయిస్తే మంచిది.
వాకడం విషయంలో జాగ్రత్తలు
వేసవిలో ద్విచక్ర వాహనాలను అవసరం ఉంటే తప్ప అదేపనిగా వినియోగించకుండా ఉంటే మంచిది. దూర ప్రాంతాలకు వాహనా ల్లో ప్రయాణం చేసే వారు ద్విచక్ర వాహనాన్ని పక్కన పెట్టి బస్సులో ప్రయాణిస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిన మార్గమధ్యంలో కాస్త చల్లటి ప్రదేశాల్లో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వాహనం ఇంజన్ కండిషన్లో ఉంటుంది.
పార్కింగ్ ముఖ్యం..
వాహనాలను ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ముఖ్యంగా స్థల సేకరణ అవసరం. పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల వద్ద పార్కింగ్ చేస్తుండడంతో పాటు ఎటువంటి నీడలేని రహదారుల పైనే పార్కింగ్ వచేయాల్సి వస్తుంది. దీంతో ఎండ అధికంగా ఉండే సమయంలో వాహనాల్లోని పెట్రోల్ ఆవిరైపోతుంది. రాత్రి వేళల్లో ఒకసారి ట్యాంక్ మూతను తీసి మళ్లీ పెట్టడం ద్వారా వేడికారణంగా ట్యాంక్‌లో ఏర్పడ్డ గ్యాస్ బయటకు వెళ్లి ఇంజన్‌లోకి ఆయిల్ సులువుగా వెళ్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం
వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం. వీలైనంత మేరకు వాహనాలను నీడలోనే పార్కింగ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. వాహనాలను ఎండ నుంచి కాపాడేందుకు క్లాత్ కవర్లు ఉపయోగపడతాయి. ఇక ఇంజన్ ఆయిల్‌ను మిగతా సమయంలో కంటే వే సవిలో కాస్త ముందుగానే మార్చుకుంటే మంచిది.
- కె.విజయకుమార్, సీనియర్ మెకానిక్, రాయవరం
ఎండ నుంచి వాహనాలకు రక్షణ ఇలా..
Published Tue, Apr 12 2016 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
ది లీడర్..!
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement