ఔటర్ పై ప్రమాదం, బెజవాడ వాసులు మృతి

29 Sep, 2014 10:21 IST|Sakshi

హైదరాబాద్ : శంషాబాద్  ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న లారీని... మహీంద్రా జైలో కారు (ఏపీ 16 టీఎల్ 5252) వెనకనుంచి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవిజయవాడ సెంట్రల్‌ ఎక్సయిజ్‌ ఉద్యోగి మహేందర్‌, ఆయన భార్య నాగరామలక్ష్మి, ఎంబీబీఎస్ చదువుతున్న సింధూర అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 

మరిన్ని వార్తలు