సర్వదర్శనం భక్తులకూ టైంస్లాట్‌ | Sakshi
Sakshi News home page

సర్వదర్శనం భక్తులకూ టైంస్లాట్‌

Published Thu, Oct 26 2017 11:55 PM

Timelot for devotees devotees

సాక్షి, తిరుమల/తిరుపతి అర్బన్‌: సర్వదర్శనం భక్తులకూ టైంస్లాట్‌లోనే శ్రీవారి దర్శనం కల్పి స్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. సర్వదర్శనం భక్తుల కోసం రూ.3.5 కోట్లతో నిర్మించిన కాంప్లెక్స్‌ను జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజుతో కలసి గురువారం ఆయన ప్రారంభించారు. కొత్తగా మరో 16 లడ్డూ కౌంటర్లను కూడా ప్రారంభించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ సర్వదర్శనం టైం స్లాట్‌ను డిసెంబర్‌ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు.

అలాగే, టీటీడీ శ్రీనివాసకల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించను న్నట్లు ప్రాజెక్ట్‌ స్పెషలాఫీసర్‌ ప్రభాకర్‌రావు తెలిపారు. ఒకరోజు శ్రీ సీతారాముల కల్యాణం, మరోరోజు శ్రీనివాస కల్యాణం జరుగుతాయ న్నారు. శని, ఆదివారాల్లో  ఇక్కడి ఎన్టీఆర్‌ స్టేడియంలో, నవంబర్‌ 8, 11 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలోనూ కల్యాణ కార్యక్రమాలు జరుగుతాయ న్నారు. 

Advertisement
Advertisement