రాకాసి పువ్వు | Sakshi
Sakshi News home page

రాకాసి పువ్వు

Published Fri, Feb 6 2015 2:17 AM

రాకాసి పువ్వు

తిరుపతి తుడా: తిరుమల శేషాచల కొండల్లో అరుదైన పుష్పం దర్శనమిస్తోంది. ప్రపంచ దేశాల్లో కేవలం మూడు రకాల పుష్పాలు మాత్రమే మాంసహారంతో జీవిస్తాయని తెలుస్తోంది. అందులో ఒకటి శేషాచల అడవుల్లో ఉండటం గమనార్హం. ఎస్వీ యూ బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.మాధవశెట్టి వీటిపై పరిశోధన చేస్తున్నారు.

రంగులతో అందంగా ..

 శేషాచలం కొండల్లో పెరుగుతున్న సన్‌డ్యూ ప్లాంట్ డ్రాసిరేసి జాతికి చెందినది మెగ్గ. డ్రాసిరా బర్మానై శాస్త్రీయ నామం. తెలుగులో బ్యాడ్ సుందరి, సీమకుట్టు, బురద బూచి, బురద సుందరి, కవారమొగ్గ పేర్లు ఉన్నాయి. శేషాచల కొండల్లో బురద, నీరు ప్రవహించే ప్రంతాల్లో పెరుగుతున్నాయి. భూమికి రెండు, మూడు అంగుళాల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. లేత గులాబీతో ఆకుపచ్చ రంగు మిళితమై ఉంటుంది. పువ్వుకు నాలుగు లేక ఐదు రేకులు ఉంటాయి. ఒక్కో రేకుపై వందల్లో గ్లాండ్ టిప్‌డ్ హేర్స్ ఉంటాయి. ఈ హేర్స్ చివరిలో బుడుపుగా ఉండాయి. సూర్యోదయం సమయంలో ఈ హేర్స్ బుడుపుల్లోంచి విడుదలయ్యే ద్రవ పదార్థాంపై సూర్య కిరణాలు పడ్డప్పుడు రంగు మరింత అందంగా మారి మెరుస్తాయి.

ఆకర్షించి .. కరిగించి

పువ్వు రేకులపై ఉండే గ్లాండ్ టిప్‌డ్ హేర్స్ నుంచి జిగడ పదార్థం ( హైడ్రోక్లోరిక్ యాసిడ్) విడుదల అవుతుంది. సూర్య కిరణాలకు అందంగా మెరుస్తూ సూక్ష్మ జీవులను ఆకర్షిస్తాయి. చిన్న పురుగులు, సూక్ష్మజీవులు రేకులపై వాలగానే జిగడలో చిక్కుకుంటాయి. ఒక్కో హేర్ నుంచి 10 మిల్లీ లీటర్‌ల జిగడ ద్రవం విడుదలై పువ్వు రేకులు ముడుచుకుంటాయి. ఆ  హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో మరిగి సూక్ష్మజీవులు కరిగిపోతాయి. తరువాత వాటిని పువ్వులు ఆహారంగా తీసుకుంటాయి. ఇలా రోజుకు ఒక్కో పువ్వు సుమారుగా 700 పురుగులు, సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకుంటాయి.


ఔషధంగా కూడా..

ఈ మొక్కకు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. పువ్వు రేకులను ఎండబెట్టి పొడి చేసి శరీరానికి పూసుకుంటే ఇరిటేషన్, ర్యాష్‌లు పోతాయి. చాలా అరుదుగా కనిపిస్తాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
 - డాక్టర్ కె.మాధవశెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్ష శాస్త్రం, ఎస్వీయూ
 
 

Advertisement
Advertisement