నేడు ప్రత్యేక విమానంలో సింగపూర్‌కు బాబు | Sakshi
Sakshi News home page

నేడు ప్రత్యేక విమానంలో సింగపూర్‌కు బాబు

Published Tue, Nov 11 2014 2:05 AM

నేడు ప్రత్యేక విమానంలో సింగపూర్‌కు బాబు - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారిగా మంగళవారం మధ్యాహ్నం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కలిపి మొత్తం 13 మంది ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్తారు. ఈ నెల 14వ తేదీ వరకు బాబు బృందం సింగపూర్‌లోనే పర్యటించనుంది. ప్రధానంగా కొత్త  రాజధానిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలు, కొత్తగా పోర్టుల నిర్మాణం వంటివి చేపట్టడానికి సింగపూర్‌కు చెందిన కంపెనీలను ఈ పర్యటనలో సీఎం ఆహ్వానించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. చంద్రబాబు పర్యటనకోసం ప్రభుత్వం రూ.కోటి వ్యయం చేయనుంది. అడ్వాన్స్‌గా రూ.68.98 లక్షలను విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి జీవో జారీ చేశారు.

 సింగపూర్ వెళ్తున్నది వీరే
 
 సింగపూర్ పర్యటనకు చంద్రబాబుతోపాటు అధికారికంగా వెళ్తున్న వారి పేర్ల జాబితా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ కమ్యునికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఐటీ సలహాదారు జె. సత్యనారాయణ, ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ ముఖ్యకార్యదర్శి డి. సాంబశివరావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం వ్యక్తిగత సహాయకుడు బి.రాజగోపాల్, సీఎం ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్ నగేశ్‌బాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.
 

Advertisement
Advertisement