టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 7:39 PM

Today News Roundup - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు టీడీపీ ఎంపీలు తమ పదవుల నుంచి వైదొలిగారు.

కేంద్ర మంత్రులు సుజనా, అశోక్ రాజీనామా
డీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. 

‘చంద్రబాబు ఇప్పుడు మేల్కోవటం ఆశ్చర్యం’
 రెండేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతున్నా పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలంటూ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీపై సవతి ప్రేమ ఎందుకు : మోహన్‌ బాబు
కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హక్కు విషయంలో నరేంద్ర మోదీని తన ట్వీటర్‌ ద్వారా ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో దారుణం.. వైఫై కోసం భార్యను...
వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్‌ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

తొందరలో కోకా కోలా కొత్త బీర్‌
కోకా కోలా(125 ఏళ్ల చరిత్రలో) కంపెనీ మొదటిసారిగా అల్కాహాలిక్ డ్రింక్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. 

రంగమ్మ.. మంగమ్మ.. ఏం పిల్లడూ!
గా అభిమానుల్లో ఇప్పుడు ఒక్కటే ఆలోచన. రంగస్థలం చిత్రం ద్వారా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తెరపై చేసే సందడి ఎలా ఉంటుంది అని.

అందుకే ధోనికి ఏ+ గ్రేడ్‌ దక్కలేదు!
భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలు భారీగా పెంచుతూ బీసీసీఐ కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కాంట్రాక్టుల్లో సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని డిమోట్‌ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

Advertisement
Advertisement