నేటి ‍ప్రధాన వార్తలు | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 1 2018 8:02 PM

Today News Roundup 1st April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రత్యేక హోదా కోసం తొమ్మిదోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానం సంబంధించి చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల చివరి వరకు వేచి చూస్తామని తెలిపారు.హోదా ఇవ్వకపోతే రాజీనామాలు చేసి ఏపీ భవన్‌ వద్ద దీక్షకు దిగుతామని వెల్లడించారు.

తొమ్మిదోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు

ప్రకాశం జిల్లా : ప్రత్యేక హోదా కోసం తొమ్మిదోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

5సార్లు ఓడిన వ్యక్తి వైఎస్ జగన్‌ను విమర్శించడమా!
సాక్షి, విజయవాడ: అయిదుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు పేర్కొన్నారు.

డిప్రెషన్‌లో చంద్రబాబు...
సాక్షి, కడప : ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్రెషన్‌లో ఉన్నారని.. అందుకే మోదీపై తిరగబడాలంటూ మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు.

చంద్రబాబు ఓ గజదొంగ: రోజా
సాక్షి, తిరుపతి: వందల హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఓ గజదొంగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు.

తెలంగాణ స్పీకర్‌కు పాలాభిషేకం.. వైరల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కటౌట్లకు, ఆయన ఫొటోలకు ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అప్పుడప్పుడు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌ మధుసూదనాచారికి ఆయన అభిమానులు పాలాభిషేకం చేశారు.

బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం
చింతపల్లి (దేవరకొండ) : బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని తెలంగాణరాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

శాటిలైట్‌తో లింక్‌ కట్‌; ఆందోళనలో ఇస్రో
న్యూఢిల్లీ: ఉపగ్రహ ప్రయోగాల్లో అనేక రికార్డులను సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల కిందట నింగిలోకి పంపిన జీశాట్‌-6ఏ ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోయింది.

పేద యువతులకు మమత పెళ్లి కానుక
సాక్షి, కోల్‌కతా : పేద యువతుల వివాహనికి చేయూత అందించడానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలికలు చదువుకునేలా, బాల్య వివాహల నిర్మూలనే లక్ష్యంగా బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే కన్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

‘విశ్వ’ శాస్త్రవేత్తకి అశ్రు నివాళి
కేంబ్రిడ్జ్ : కాలం కథను వివరించిన  భౌతిక శాస్త్రవేత్త  స్టీఫెన్ హాకింగ్‌(76) అంత్యక్రియలు కేంబ్రిడ్జ్‌ పట్టణంలో శనివారం జరిగాయి.

ఆట మధ్యలోనూ అమ్మతనం చాటింది..
అల్బర్టా : ఎనిమిది వారాల కిందట పాపకు జన్మనిచ్చిన కెనడా హాకీ క్రీడాకారిణి సారా స్మల్‌కు ఓ సమస్య ఎదురైంది. ఇటీవల ఓ హాకీ మ్యాచ్‌లో పాల్గొన్న ఆమె తనతోపాటు పాలిచ్చే బ్రెస్ట్‌ పంప్‌ తీసుకెళ్లడం మరచిపోయింది. 

ఫించ్‌ స్థానంలో సెహ్వాగ్‌?
మొహాలీ: క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌ గుడ్‌ బై చెప్పి చాలా కాలమే అయ్యింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా, క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా సెహ్వాగ్‌ కొనసాగుతున్నాడు. 

ఏప్రిల్‌ 7న మహేశ్‌ బహిరంగ సభ
కొరటాల శివ, మహేశ్‌ బాబు కలయికలో రూపొందుతున్న చిత్రం భరత్‌ అనే నేను. ఈ చిత్రం విడుదలకు ముందే అంచనాలు ఆకాశాన్నంటాయి.

Advertisement
Advertisement