టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 6:24 PM

Today News Roundup 27th April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయానికి కారణమేంటో తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు అన్నారు. ఆయన శుక్రవారం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం కన్నువేయడమే భయానికి కారణమన్నారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ ఇంకా వెంపర్లాడుతూ తమపై విమర్శలు చేయడమా అని మండిపడ్డారు. కేంద్రమంత్రి రాందాస్‌ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని విష్ణు స్పష్టం చేశారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు భయానికి కారణం ఏంటీ?
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయానికి కారణమేంటో తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు అన్నారు. 

ముగిసిన పంచాయితీ.. సుబ్బారెడ్డి అసంతృప్తి
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయితీపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

‘హైదరాబాద్‌ కేంద్రంగా భూకంపం పుట్టిస్తా’
సాక్షి, హైదరాబాద్‌ : దేశానికి ఏదో చేయాలనే ఆలోచన నుంచి పుట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఓ ప్రకంపనలా జాతీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోందని పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. 

గెలిస్తే మోదీ.. ఓడితే యెడ్డీ!
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

కథువా కేసు : విచారణపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా మైనర్‌ బాలిక హత్యాచారం కేసు విచారణపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

‘అది నా ప్రజాస్వామిక హక్కు’
లండన్‌ : మే 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం తన ప్రజాస్వామిక హక్కు అని లిక్కర్‌ కింగ్‌, బ్యాంకులకు కోట్లాది రుణాల ఎగవేత కేసులో నిందితుడు విజయ్‌ మాల్యా అన్నారు.

కిమ్‌ చరిత్రాత్మక కరచాలనం
పాన్‌మున్‌జోమ్‌ : ముఖంపై చిరునవ్వుతో కరచాలనం చేస్తూ శత్రు దేశాధినేతను ఆత్మీయంగా పలకరించారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌.

చరిత్రలో అతి పెద్ద బాలల నర బలి
పెరూ, దక్షిణ అమెరికా : చరిత్రలో అతిపెద్ద బాలల నరబలి సంఘటనను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

బడ్జెట్‌ ధరలో శాంసంగ్‌ కొత్త ఫోన్‌
స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌ తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది.

మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్ కు సరికొత్త బాధ్యతలు!
బీజింగ్‌: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

కన్ను గీటింది...అవార్డు పట్టింది
ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే‍ పెద్ద సెలబ్రెటీగా మారిపోయింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.

గంభీర్‌ నీకిది తగునా..?
ఐపీఎల్‌ 11 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

డివిలియర్స్‌ షాకింగ్‌ వీడియో వైరల్‌..
బెంగుళూరు : దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌కు మన దేశంలో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement