టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Sun, Sep 3 2017 7:01 PM

today news roundup

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : కేంద్రమంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురికి కేబినెట్‌ హోదా ప్రమోషన్‌ లభించగా.. తొమ్మిది మంది కొత్త వారు సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
<<<<<<<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>>>>>>
 
‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార వికేంద్రీకరణతో జరిగే విప్లవాత్మక పాలనలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ (సచివాలయం) ఏర్పాటు చేస్తాం. ఈ సెక్రటేరియట్‌లో ఆ గ్రామానికి చెందిన వివిధ సామాజిక వర్గాల వారికి పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. 
 
 
వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.
 
 
చాన్నాళ్లుగా ఆసక్తి రేపుతున్న కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ నేడు జరగనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>
 
 
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకు తాజా మంత్రివర్గ విస్తరణే నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ విమర్శించారు.
 
రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు మోదీ కేబినెట్‌లో అత్యంత కీలక శాఖ దక్కడంపై పలువురు ఆమెకు  అభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలనూ చూసిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నిర్మలకు శుభాకాంక్షలు తెలిపారు.
 
ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అల్లలాడిపోయే నగరాల్లో అస్సాం రాజధాని కూడా ఒకటి. సెలవు రోజుల్లో కూడా వాహనాలు ఒకదాని వెనుక నత్తనడకన సాగాల్సిందే. వీఐపీ వాహనాలు కూడా అందుకు మినహాయింపేం కాదు.
 
పశ్చిమ బెంగాల్‌లో దుర్గా నవరాత్రుల సందర్భంగా సెక్స్‌ వర్కర్లు చెఫ్‌ల టోపీలు ధరించనున్నారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్‌ ఏరియా అయిన సోనాగచ్చి నగరంలోని సెక్స్‌ వర్కర్లు దుర్గా పూజ సందర్భంగా మత్స్యశాఖ ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ కోర్టుల్లో చెఫ్‌గా పనిచేయనున్నారు. 
 
మీడియాను, ప్రజలను ఊహించనిరీతిలో ఆశ్చర్యపరచడం, విస్మయానికి గురిచేయడం నరేంద్రమోదీ-అమిత్‌ షా ద్వయానికి వెన్నతో పెట్టిన విద్య. 
 
 
<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>
 
 
ఉత్తరకొరియా మరో అణు పరీక్షను నిర్వహించినట్లు దక్షిణ కొరియా ఆదివారం పేర్కొంది. 
 
లా ట్యూనా కెనియన్‌లో చెలరేగిన కార్చిచ్చు శనివారం రాత్రి ఉత్తర లాస్‌ ఏంజిల్స్‌ నగరాన్ని వణికించింది.
 
ఫొటోలో బంతుల్లా కనిపిస్తున్న వాటి పేరు సర్వైవర్‌ క్యాప్సూల్స్‌. వరదలు, సునామీలు గట్రా వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు పనికొచ్చే గూళ్లు అన్నమాట.
 
రక్తంలోకి బైలిరూబిన్‌ అనే పదార్థం ఎక్కువగా విడుదల కావడం వల్ల వచ్చే కామెర్ల వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టం. రక్త పరీక్ష చేస్తేగానీ గుర్తించలేని ఈ వ్యాధిని.. కేవలం ఓ సెల్ఫీతో గుర్తించవచ్చట.
 
<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>
 
 
నల్లధనం అణచివేతకు నరేంద్రమోదీ సర్కారు అమలుచేసిన పెద్దనోట్ల రద్దు.. పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదని వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 
 
 వినాయక చవితి సందర్భంగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబేలా కొత్త రూ.200 నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
సంచలన రిలయన్స్‌ జియో 4 జీ ఫీచర్‌ ఫోన్‌ నవరాత్రికి కస్టమర్లను మురిపించనుంది. జియో వినియోగదారులు  తన మొదటి  ఫీచర్‌ఫోన్‌తో  ఈ ఏడాది  దసరా  సంబరాలను  జరుపుకునేలా ప్లాన్‌ చేసింది.
 
నగదు లావాదేవీలను తగ్గించే దిశగా బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) కసరత్తు ప్రారంభించింది. 
 
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. 
 
వివాదాస్పద చిత్రంగా టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో ఏ సినిమా లేనంతా నిడివితో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాకు మరో పది నిమిషాల సీన్స్ ను యాడ్ చేశారు. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
 
 చేతిలో సొమ్ముంటే కొండపైన కోతి కూడా దిగివస్తుందనే నానుడి ఉంది. అలాంటిది నటి అనుష్కలాంటి టాప్‌ కథానాయికకు జిమ్‌ ఒక లెక్కా. 
 
 
 
 
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. భారత్‌ డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అనూహ్యంగా శ్రీలంక సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.
 
 గత కొంతకాలంగా తీవ్రంగా నిరాశపరుస్తున్న తమ వికెట్ కీపర్ మాథ్య వేడ్ ను బంగ్లాదేశ్ జరిగే రెండో టెస్టుకు పక్కన పెడుతున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు.
 
 భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ మరోసారి మద్దతుగా నిలిచారు. 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement