నేటి ముఖ్య వార్తా విశేషాలు | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్య వార్తా విశేషాలు

Published Sat, Aug 19 2017 10:02 AM

today news updates

ఉప ఎన్నిక ప్రచారం
నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం 11వ రోజుకు చేరుకుంది. సంజీవనగర్‌ నుంచి నేడు వైఎస్‌ జగన్ రోడ్‌ షో ప్రారంభం కానుంది.

చంద్రబాబు ప్రచారం
నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
 
భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నేడు భారీ వర్ష సూచన ఉంది.

రాహుల్‌ పర్యటన
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్నారు. బీఆర్డీ ఆసుపత్రిలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు.

వైఎస్ఆర్‌సీపీ సమావేశం
కాకినాడ మున్సిపల్‌ ఎన్నికలపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు సమావేశం కానుంది. ఐదు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు.

ఫొటోగ్రఫీ
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.

Advertisement

తప్పక చదవండి

Advertisement