రైలు ఆగితే.. ఇక ఇంజినూ ఆగుతుంది! | Sakshi
Sakshi News home page

రైలు ఆగితే.. ఇక ఇంజినూ ఆగుతుంది!

Published Wed, Sep 11 2013 1:33 AM

Train engine to be stop, if train stop

సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధికంగా డీజిల్‌ను వినియోగిస్తున్న రైల్వేశాఖ.. ఆ వ్యయాన్ని తగ్గించుకొనేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రైలు ఆగి ఉన్నప్పుడు ప్రధాన ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచాల్సిన అవసరం లేకుండా చేసే.. ‘యాక్సిలర్ పవర్ యూనిట్ (ఏపీయూ)’ను డీజిల్ లోకోమోటివ్ (ఇంజిన్)లలో ఏర్పాటు చేయనుంది. తొలుత ప్రయోగాత్మకంగా 12 ఇంజన్లలో ఏర్పాటు చేసి పరిశీలిస్తోంది. ఈ ఏపీయూ వల్ల ఒక్కో లోకోమోటివ్ ఏడాదికి రూ. 20 లక్షల విలువైన డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోగలుగుతుందని అంచనా.

Advertisement

తప్పక చదవండి

Advertisement