Sakshi News home page

ఏసీబీ వలలో ఖజానా కార్యాలయం ఉద్యోగి

Published Sat, May 10 2014 1:09 AM

ఏసీబీ వలలో ఖజానా కార్యాలయం ఉద్యోగి - Sakshi

గుంటూరు సిటీ, న్యూస్‌లైన్, జిల్లా ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ డి.రవికిరణ్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వల పన్ని పట్టుకున్నారు. గుంటూరు ఏసీబీ డిఎస్పీ రాజారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాసరి బాలకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ఎరన్డ్ లీవ్ రూ. 4 లక్షల50 వేలు మంజూరు కావాల్సివుంది. జిల్లా ఖజానా కార్యాలయంలో ఏప్రిల్ 9వ తేదీ బిల్లు సమర్పించాడు. బిల్లు మంజూరు నిమిత్తం సీనియర్ అకౌంటెంట్ రవికిరణ్ లక్షకు వెయ్యి రూపాయల వంతున రూ.4,500 లంచం డిమాండ్‌చేశాడు.

పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి న బాలకృష్ణ తనకు బిల్లు మంజూరై బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాగానే ఇచ్చేట్లుగా రవికిరణ్‌తో ఏప్రిల్ 18న ఒప్పం దం చేసుకున్నాడు. గత నెల 22వ తేదీ బాలకృష్ణ ఖాతాలో రూ. 4 లక్షల 50 వేలు జమయింది. దీంతో తనకు లంచం కింద రూ. 4,500 ఇవ్వాలని రవికిరణ్ ప్రతీ రోజూ బాలకృష్ణకు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. అనుకున్న ప్రకారం డబ్బులివ్వకపోతే తదుపరి వచ్చే బెనిఫిట్లను నిలుపుదల చేస్తానని హెచ్చరించడం తో బాలకృష్ణ గుంటూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఏసీబీ అధికారుల వ్యూహం మేరకు శుక్రవారం బాలకృష్ణ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ రవికిరణ్‌కు మూడు వేల రూపాయలు ఇచ్చాడు. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న రవి కిరణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నింది తుడు రవికిరణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎ స్పీ రాజారావు తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎం.నరసింహారెడ్డి, కె.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement