గిరిజనుల్లో జీసీసీ చింత | Sakshi
Sakshi News home page

గిరిజనుల్లో జీసీసీ చింత

Published Tue, Feb 16 2016 12:44 AM

గిరిజనుల్లో జీసీసీ చింత - Sakshi

జీవో 68పై ఆందోళన
గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలి..
చింతపండుకు  మద్దతు ధర ప్రకటించాలి...

   
భామిని : ఆదివాసీ గిరిజనులకు చింతపండు చింత పట్టుకుంది. ప్రభు త్వం తెచ్చిన జీవో 68 వల్ల జీసీసీ చింతపండు కొనుగోలు చేయకపోవడం పై ఆందోళన చెందుతున్నారు.  తమ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, జీసీసీనే కొనుగోలు చేసేందుకు వీలుగా పోరాటం చేయూలని నిర్ణరుుంచారు. తమ అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా సేకరించాలనే డిమాండ్‌తో పోరాటానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 68తో వీరికి కష్టాలు ప్రారంభమయ్యూరుు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గిరిజనం జీవోను రద్దు చేసే వరకు పోరాడాలని నిర్ణరుుంచారు. ఈ క్రమంలో ఆందోళనకు కార్యరూపం సిద్ధం చేస్తున్నారు.


ఇదీ నేపథ్యం...
గత ఏడాది అక్టోబరు 16న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 68ని విడుదల చేసింది. దీని ప్రకారం గిరిజన సహకార కార్పొరేషన్ ద్వారా సేకరిస్తున్న చింతపండు, గమ్‌కరియూ, ఇప్పపువ్వులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత నుంచి తప్పించే అవకాశం కల్పించింది. దీంతో చింతపండుకు గిట్టుబాటు లేక పంట దిగుబడులు ఏం చేయూలో తెలియ ని అయోమయ పరిస్థితులు నెలకొన్నారుు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో పీసా చట్టానికి పూర్తిగా విరుద్దంగా ఉందని గిరిజనుల ఆరోపణగా ఉంది. ఓ వైపు పీసా చట్టం అమలు చేస్తున్నామని చెబుతూనే మరోవైపు ఇటువంటి వివాదాస్పద జీవోల ద్వారా తమ జీవనంపై ప్రభుత్వం దెబ్బకొడుతోందని వారు ఆరోపిస్తున్నారు. జీసీసీ ద్వారా తమ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయూల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి ఈ ఏడాది చింతపండు దిగుబడులు బాగా వచ్చాయని, జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో ఏం చేయూలో తోచ డం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెడ లు వంచేందుకు ఈ నెల 16న విశాఖపట్నంలోని జీసీసీ ఎండీ కార్యాలయం ముం దు భారీ ధర్నాకు గిరిజనులు సిద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement