టీటీడీలో అక్రమాలపై చర్యలేవి? | Sakshi
Sakshi News home page

టీటీడీలో అక్రమాలపై చర్యలేవి?

Published Fri, Feb 13 2015 1:49 AM

ttd

తిరుపతి కల్చరల్: టీటీడీకి సమాచార హక్కు చట్టాన్ని వర్తింపచేసి తద్వారా అక్కడ జరిగే అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని హిందూ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఓంకార్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  టీటీడీ అవినీతి, ఆక్రమాలు, కుంభకోణాలు, అన్య మతస్తులతో పూర్తిగా నిండిపోయిందని ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించిన వారికి కనీస సమాధానం కూడా దొరకడం లేదన్నారు.

తిరుమలలోని మఠాలలో ఏటా సుమారు 200 కోట్లు అవినీతి జరుగుతున్నా చర్యలు లేవన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బహిరంగంగా అన్యమత ప్రచారం చేస్తున్న ప్రిన్సిపాల్ క్రిష్టఫర్, రాజశేఖర్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సమావేశంలో  హిందూ చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement